NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

భారతీయ ఋషి పరంపరను కాపాడుకుందాం..

1 min read

– మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్వామీజీ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  భారతీయ ఋషి పరంపర చాలా గొప్పదని, ఆధునిక శాస్త్రవేత్తలు యంత్రోపాసకులు – ఋషులు మంత్రోపాసకులని వారి ఉపాసనంతా లోక సంక్షేమం కోసమేనని , ఆ పరంపరలోనే ఈనాటికీ ప్రతిహిందువు ఎల్లవేళలా లోకాసమస్తా సుఖినోభవంతు అనే మూలసూత్రం మీదనే తన ఉపాసనంతా కొనసాగుతూ ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రణవ పీఠాధిపతులు, అభినవ శుక, త్రిభాషా మహాసహస్రావధాని,   బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ స్వామీజీ అన్నారు. గురువారం సాయంత్రం గోదాగోకులం నందు నిర్వహించిన మహర్షుల  చరిత్ర అనే అంశంపై సుదీర్ఘ ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రయాగ త్రిదండి రాఘవ ప్రపన్న జీయర్ స్వామీజీ, జిల్లా న్యాయమూర్తి నేరెళ్ళ శ్రీనివాసరావు దంపతులు , న్యాయసేవాధికారసంస్థ సెక్రటరి వెంకట నాగ శ్రీనివాసులు గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు గోదా గోకులం సభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

About Author