సమస్యల పరిష్కారానికే మీ ఇంటికి వచ్చా…
1 min read– రోడ్లపైనే మురుగునీరు డ్రైనేజీ నిల్వపై కాలనీవాసుల ఎమ్మెల్యే కు మొర
– సమస్యలపై ఎప్పటికప్పుడు అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు
– ఈరోజు మిడుతూరులో గడప గడప
– మిడుతూరు గడప గడపలో ఎమ్మెల్యేకు ప్రజలు బ్రహ్మరథం
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మీ సమస్యలను తెలుసుకునేందుకే మీ ఇంటికి వస్తున్నానని నందికొట్కూరు శాసనసభ్యులు తొగరు ఆర్థర్ ప్రజలతో అన్నారు.శుక్రవారం ఉదయం 10 గంటలకు మిడుతూరులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. మిడుతూరు గ్రామంలో కొత్తపేట,బీసీ కాలనీ,పింజరి కాలనీ,మైనార్టీ కాలనీల్లో ఎమ్మెల్యే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని మండల అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.అంతేకాకుండా చిన్న పిల్లలను,వృద్ధులను ప్రతి ఒక్కరినీ కూడా మంచి పలకరింపులతో వారి భుజాన్ని తట్టి నేను మీకు తోడుగా ఉన్నాననే భరోసాను ప్రజలకు కల్పిస్తూ ఎమ్మెల్యే ముందుకు సాగారు.బీసీ కాలనీలో ఉన్న అంగనవాడి కేంద్రంలో విద్యార్థులతో మాట్లాడారు. మాఇంటి దగ్గర సంవత్సరం కిందట కరెంటు స్తంభం వేశారు కానీ ఇంతవరకు కరెంటు లైన్ వెయ్యలేదని,ఇంతవరకు అమ్మ ఒడి డబ్బులు రాలేదని కాజీపేట సుజాత ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.అదేవిధంగా సీసీ రోడ్లు,ఇంటి స్థలాలు ఇంతవరకు ఇవ్వలేదని కొందరుకొందరు తెలుపగా,ఇండ్లు మంజూరు చేయాలని,కరెంట్ సమస్య తదితర సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకువచ్చారు.కొత్తపేట,బీసీ కాలనీ(వాల్మీకి నగర్)లో ఎమ్మెల్యే నడుస్తూ ఉండగా రోడ్లపైనే మురుగునీరు,డ్రైనేజీ చెత్తా చెదారం రోడ్లపైనే నిల్వ ఉండటం వలన వాటిని చూసి ఎమ్మెల్యే అవాక్కయ్యారు. రోడ్ల పైన ఈ విధంగా మురుగునీరు ఉండటం వలన మేము ఏ విధంగా నడవాలంటే కాకుండా విషపురుగులు మా ఇంట్లోకి వస్తూ ఉన్నాయని మా ఇండ్లలో పిల్లలు వృద్దులు ఉన్నారని మేము భయభ్రాంతులకు గురవుతున్నామని అంతేకాకుండా వీటి వల్ల దోమలు స్ప్రెడ్ అవుతున్నాయని అంతేకాకుండా అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా వారు పట్టించుకోవటం లేదని కాలనీవాసులు మహిళలు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు.ఎందుకు ఇలా జరుగుతుందంటూ అధికారులపై ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. వెంటనే వీటిని తొలగించాల్సిందిగా పంచాయతీ కార్యదర్శి సుధీర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. బరకల రస్తా జగనన్న కాలనీలో రాస్తా పక్కనే ట్యాంకులు ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నీళ్లన్నీ రైతులు వెళ్లే రస్తాకు నీళ్లు రావడం వలన అక్కడ నిల్వ ఉండటంతో ఈ రహదారి గుంతల మయంగా ఉండటం వలన రైతులు,ఎద్దుల బండ్లు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉందని ఈ ట్యాంకులను జగనన్న కాలనీలో లోపలికి కట్టించాలని అదేవిధంగా గ్రామంలో ఉన్న గ్రంథాలయం బాడుగ ఇంట్లో నడుస్తూ ఉందని గ్రంథాలయం నిర్మించాలని ఎమ్మెల్యే కాత రమేష్ రెడ్డి ఇంటి వైపున వెళ్తుండగా రమేష్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.నిన్న 867 ఇండ్ల దగ్గరికి వెళ్లి ఎమ్మెల్యే ప్రజలతో మాట్లాడారు.ఈరోజు శనివారం రోజున మిడుతూరులో గడప గడప కార్యక్రమం ఉదయం 10 గంటలకు ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. నందికొట్కూరు రూరల్ సీఐ జి. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈకార్యక్రమంలో ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి, తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు, ఏఓ పీరు నాయక్,ఏఈలు విశ్వనాథ్,క్రాంతి కుమార్, రమేష్,అంగన్వాడి సూపర్వైజర్ రేణుక దేవి, ఏపీఎం సుబ్బయ్య,రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్,పంచాయతీ కార్యదర్శులు సుధీర్,కేశావతి,వీఆర్వో వెంకటయ్య,నాయకులు కాల రమేష్,చంద్రశేఖర్ రెడ్డి,వెంకట్, పుల్లయ్య,శ్రీనివాసులు,ఇనా యతుల్ల వివిధ గ్రామాల నాయకులు అధికారులు పాల్గొన్నారు.