PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు నాయుడు  పర్యటన అడ్డుకోవడం పిరికి పంద చర్య…

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సాగునీటి ప్రాజెక్టుల సందర్శన లో భాగంగా  చంద్రబాబు నాయుడు పర్యటనను  అడ్డుకోవడం పిరికి పంద చర్య అని రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ జయసూర్య పేర్కొన్నారు. శుక్రవారం పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు  పర్యటనను వైకాపా శ్రేణులు అడ్డుకోవడంపై నందికొట్కూరు  నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నందికొట్కూరు పటేల్ సెంటర్లో తెలుగుదేశం కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ గిత్త జయసూర్య మాట్లాడుతూ  ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉండగా, ఈ వైకాపా ప్రభుత్వం రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తూ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  పర్యటన అడ్డుకోవడం పిరికి పంద చర్య  అన్నారు.వైసీపీ శ్రేణులు అరాచకానికి పోలీసులు అండగా నిలవడం దారుణమన్నారు. రేపు వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే. చంద్రబాబు పై రాళ్ల దాడికి ఘటనకు సహకరించిన ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాయలసీమ అన్ని ప్రాంతాలకు నీళ్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధ్వంసం చేసిందని వాటిని ప్రపంచానికి చూపేందుకు వస్తున్న చంద్రబాబు  పర్యటన అడ్డుకోవడం దారుణమని, తెలుగుదేశం శ్రేణులపై వైకాపాశ్రేణుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు జయసూర్య తెలిపారు. పుంగనూరులో పోలీసులు కూడా పెద్దిరెడ్డి కనుసన్నలలో  పనిచేస్తున్నారని ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చని  పేర్కొన్నారు. కార్యక్రమంలో  రాష్ట్ర టిడిపి మైనార్టీ అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్, రాష్ట్ర లీగల్ సెల్ జాకీర్ హుస్సేన్, నందికొట్కూరు పట్టణ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు నిమ్మకాయల రాజు, పగిడాల మండల కన్వీనర్ పలుచని మహేశ్వర్ రెడ్డి, మహానంది, ప్రభాకర్, లింగస్వామి, గొల్ల నాగ శేషులు, కళాఖర్, మౌలానా అబ్దుల్ సలాం, పగడం శేఖర్, కొణిదెల యువ నాయకుడు బ్రహ్మానంద రెడ్డి, టిడిపి సోషల్ మీడియా భాష, పగిడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

టిడిపి, సోషల్​ మీడియా, నియోజకవర్గం, రాయలసీమ,

About Author