PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కష్టపడి పని చేసేవారికి- భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయి

1 min read

– నూరు సహకార సొసైటీ అధ్యక్షులుగా అల్లి శ్రీరామ మూర్తి ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: నిత్యం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ వారికి చేదోడువాదో డుగా తనదైన శైలిలో సహాయ సహకారాలు అందించే ప్రతి ఒక్కరికి భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని అలాంటి వారిలో ప్రజలకు సేవ చేసే గుణం ఉంటుందని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, శనివారం స్థానిక పంచాయతీ కార్యాలయ ఆవరణలో చెన్నూరు సహకార సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామ్మూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, బీసీ కులానికి చెందిన అల్లి శ్రీరామ్మూర్తి ఫారెస్ట్ డిపార్టుమెంటు లో విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం జరిగిందన్నారు, అలాగే చెన్నూరు శ్రీ శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయ చైర్మన్ గా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగిందన్నారు, అలాంటి వ్యక్తికి చెన్నూరు సహకార సొసైటీ అధ్యక్షత బాధ్యతలు అప్పగిస్తే మరింత బాధ్యతాయుతంగా రైతులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే కాకుండా, సహకార సొసైటీ అభివృద్ధికి దోహదపడతారని అవకాశం కల్పించడం జరిగిందన్నారు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత కల్పించి, వారి సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగిందన్నారు, అంతేకాకుండా వారి రాజకీయ ఎదుగుదల కోసం ఆయన ఎంతో కృషి చేయడం జరిగిందన్నారు, ఇలా వారు రాజకీయ ఎదుగుదలతో ఆయా కులాల అభివృద్ధికి దోహదపడతారని ఆశించి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు, దీంట్లో భాగంగానే అన్ని కులాలకు కార్పొరేషన్ లు కల్పించి ప్రతి కులానికి రాజకీయ ఎదుగుదల తో ప్రోత్సహించడం జరిగిందన్నారు, అలాగే ప్రభుత్వం విద్య ,వైద్యం, వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సాధించడం జరిగిందని, దేవుని దయవల్ల ప్రకృతి ప్రకృతి అనుకూలించి ప్రతి సంవత్సరం కూడా వర్షాలు బాగా కురవడం వల్ల అటు రైతులు, ఇటు రైతు కూలీలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలియజేశారు, పార్టీలో ఉంటూ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు మంచి రోజులు వస్తాయని ఆయన చెలి చేశారు, అనంతరం అకార సొసైటీ అల్లి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ, బీసీ వర్గానికి చెందిన తను తెలుగుదేశం ఆవిర్భావం నుండి ఆ పార్టీ కొరకు పనిచేయడం జరిగిందన్నారు, అయితే ఏనాడు కూడా మమ్మల్ని గుర్తించి తనకు న్యాయం చేసిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు, నా కులానికి ఒక అవకాశం ఇచ్చి నాకు ఒక గుర్తింపును తీసుకువచ్చి తనను సహకార సొసైటీ అధ్యక్షులుగా నియమించినందుకు కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని, అలాగే నా చివరి రక్తపు బొట్టు వరకు పార్టీ కొరకు పనిచేస్తానని ఈ సందర్భంగా అల్లి శ్రీరామ్మూర్తి తెలిపారు, ఈ సందర్భంగా చైర్మన్గా ఎన్నికైన అల్లి శ్రీరామ మూర్తి, డైరెక్టర్లుగా ఉప్పరపల్లి గ్రామపంచాయతీ కి చెందిన గాజుల పల్లె సంపూర్ణ రెడ్డి, కొండపేట గ్రామానికి చెందిన గంగులయ్యల చేత ప్రమాణ స్వీకారం చేయించారు, ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైయస్సార్సీపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ వి ఎస్ ఆర్, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, జయభారత్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, జె సి ఎస్ కన్వీనర్లు ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, శ్రీనివాసరాజు, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, పుత్త వేణుగోపాల్ రెడ్డి, ఆర్ ఎస్ ఆర్, సర్పంచులు, ఎంపీటీసీలు, పి సి కేశవ రెడ్డి వైయస్సార్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

About Author