మళ్లీ ఎంపీగా రాహుల్ గాంధీ ! చివరికి న్యాయమే గెలిచింది
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద : గౌరవనీయులైన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీకి భారీ ఊరట లభించింది. మిట్ట 2019 నాటి పరువు నష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ గుజరాత్ లోని సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పుపై దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం స్టే విధించింది ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తద్వారా లోకసభ సభ్యత్వం మళ్లీ పొందడానికి రాహుల్ కు అవకాశం లభించింది ఈ తీర్పుతో రాబోయే లోకసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి ఇక అడ్డంకులు తొలగాయి అని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కర్నూల్ డిస్టిక్ ఆలూరు తాలూకా.హొళగుంద మండలంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా ఆధ్వర్యంలో సుమారు వందమంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సంబరాలు చేసుకోవడం జరిగింది. సభాని ఉద్దేశించి అమానుల్లా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే నిరుపేదలకు ఆర్థిక సహాయం 6000 ఇవ్వడం జరుగుతుందని అదేవిధంగా రైతు రుణాలు మాఫీ ఆరు లక్షల వరకు చేస్తారని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది ప్రజలు తెలియజేయడమైనది అందుకే మీరు మీ అందరూ కాంగ్రెస్ పార్టీ రాబోయే 2024 సంవత్సరంలో అత్యధిక మెజార్టీతో ఓటు వేసి వేయించి గెలిపించాలని మానవితో కోరుచున్నానని అమానుల చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హెచ్ సి మల్లేశప్ప, సి. పార్వతమ్మ. సి. వసంతమ్మ. సి. గంగమ్మ మరియు ఎస్సీ కాలనీ వాసులు హెచ్ వరుసప్ప గుంతకల్ ఈరన్న లష్కర్ నాగరాజ్ వెంకటేష్ చిన్నప్ప పార్వతి ఈరమ్మ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.