బిసి హొలగుంద మండల అధ్యక్షుడుగా బోయ నాగప్ప ఎన్నిక
1 min readపల్లెవెలుగు వెబ్ హోలగుంద: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు గుడిసె శివన్న ఆధ్వర్యంలో ఆలూరు తాలూకా అధ్యక్షుడు రంగస్వామి సమక్షంలో హోలగుంద మండలకమిటి అధ్యక్షుడిగా బోయ నాగప్ప ప్రధాన కార్యదర్శిగా వెంకటేశ్వర్లు ఏన్నుకోవడం జరిగింది. కర్నూలు జిల్లా అధ్యక్షులు గుడిసె శివన్న మాట్లాడుతూ బీసీలందరూ ఐక్యంగా ఉండాలని తమ హక్కుల కోసం పోరాడాలని నేటికీ ఓబిసి కుల గనుక జరగలేదని చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని బీసీలకు కేంద్ర ప్రభుత్వం బీసీలకు చిన్న చూపు చూస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బిసి నాయకులు బి ఎన్ టాకీస్ వెంకటేశ్వర్లు ఆది పాల్గొన్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షులుగా మల్లికార్జున ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు చంద్ర కార్యదర్శులుగా సి శివన్న వెంకోపన్న సహాయ కార్యదర్శిగా రాఘవేంద్ర రమేష్ కార్యవర్గ సభ్యులుగా సోమిరెడ్డి మల్లి బీరప్ప ఎర్రిస్వామి తిక్కన్న పాండు గజ్జల రమేష్ ఏకగ్రీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.