వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలి…
1 min read– భవిష్యత్తులో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదు.
– వైసీపీ ప్రభుత్వం పై ప్రజల తిరుగుబాటు మొదలైంది.
– వైసీపీ శ్రేణులు దిగజారుడు రాజకీయం మానుకోవాలి.
– మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, టిడిపి నాయకులు గంజాయి నాగముని.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పుంగనూరులోపర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మీద మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, గుండాలు రాళ్ల దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరియు అతని అనుచరులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీగా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గంజాయి నాగముని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడి కి అనుమతి లేదనీ పోలీసులు భీమగానిపల్లి వద్ద చంద్రబాబు నాయుడు వచ్చే మార్గంలో లారీలను, వాహనాలను అడ్డుపెట్టి అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా వాహనాలు అడ్డుపెట్టడంతో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం జరిగిందన్నారు. తెలుగుదేశం శ్రేణులపై పోలీసులు లాఠీఛార్జ్ పలువురు టీడీపీ కార్యకర్తలకు గాయపడ్డారని, టీడీపీ శ్రేణులపై బాష్పవాయువు ప్రయోగించి, కాల్పులు జరిపి పత్రికా విలేకరులను, తెలుగుదేశం కార్యకర్తలను, గాయపరచడం జరిగిందని, ఇలాంటి దుచ్చర్యలకు పోలీసులు పాల్పడడం, పోలీసు వ్యవస్థకు సిగ్గుచేటన్నారు. ఇది ఒక దుర్దినమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా, గుండాల్లా మారి దాడులకు దిగజారడం ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి విరుద్ధమని, ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది ఖూనీ గావించబడిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి అంటే చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యబద్ధంగా యాత్ర కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీగా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ సంఘటనలో పోలీసులు వైసీపీ పార్టీకి వత్తశు పలుకుతూ ఇలా చేయడం సరైనది కాదని ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబును అడ్డుకున్న ప్రతి ఒక్కరు మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం చెందారు.రౌడీ రాజకీయాలతో ప్రతిపక్ష నేతలను భయపెట్టాలనుకోవడం వైసీపీ కలే అవుతుందని , ఇలాంటి చర్యలు మానుకోకపోతే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని దుష్ట ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం పై ప్రజల్లో తిరుగుబాటు మెదలు అయింది దానిని తట్టుకోలేక ఈ దాడులు, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలకడం మాని ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని హితవు పలికారు.