స్కిల్ అప్‌గ్రేడేషన్ శిక్షణ పూర్తి…. ధృవీకరణ పత్రాలు అందజేత
1 min read– సాంకేతీకత, సమకాలీన అంశాలపై పట్టు సమర్థవంతమైన పాలనకు కీలకం – శ్రీ భార్గవ్ తేజ IAS
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: 1 నుంచి 23 సచివాలయాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, శానిటేషన్ సెక్రటరీలు, సంక్షేమ కార్యదర్శులు స్కిల్ అప్‌గ్రేడేషన్ శిక్షణను ఈరోజు పూర్తి చేశారు.వారు డిజిటల్ మరియు అడ్మినిస్ట్రేటివ్ అంశాలపై విస్తృతంగా శిక్షణ పొందారు.మొదటి బ్యాచ్ కు శిక్షణ పూర్తయిన సందర్భంగా, కమిషనర్ శ్రీ భార్గవ్ తేజ IAS గారు వారిని అభినందిస్తూ, శిక్షణ ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి పాలనలో మీరే కీలకమని, సాంకేతికత, సమకాలీన అంశాలపై పట్టు మరియు మెరుగైన ప్రజా సంబంధాలతో ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించాలని వార్డు కార్యదర్శులకు సూచించారు.కార్యక్రమంలో కర్నూలు నగరపాలక సంస్థ మేనేజర్ ఎన్.చిన్న రాముడు, ఆర్‌ఓ కేఎండీ జునైద్, శిక్షణ కేంద్రం కో-ఆర్డినేటర్ వాసు తదితరులు పాల్గొన్నారు.