PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే విధంగా చర్యలు చేపట్టండి

1 min read

– జిల్లా కలెక్టర్ డాక్టర్. జి .సృజన…

పల్లెవెలుగు వెబ్  కర్నూలు : బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించే విధంగా  చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్.జి .సృజన టెలి కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సాయంకాలం జిల్లా కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో వివిధ అంశాల మీద  జిల్లా కలెక్టర్ డాక్టర్.జి .సృజన టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ సిస్టం డ్రాప్ అవుట్లు ,స్కూల్ డ్రాప్ అవుట్ లు, పదవ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులు , బడి వయసు కలిగి బడి బయట ఉన్న పిల్లలను స్కూల్లో చేర్పించి వారిని  స్టూడెంట్ ఇన్ఫోలో అప్డేట్ చేయించే  బాధ్యత జిల్లా విద్యాధికారి , అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సర్వ శిక్ష అభియాన్ పి ఓ , ఎంఈఓ లదేనని  కలెక్టర్  టెలికాన్ఫరన్స్ ద్వారా సంబంధిత అధికారులను ఆదేశించారు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతూ స్టూడెంట్ ఇన్ఫోలో రాని వెయ్యి మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న  23,000 విద్యార్థులను జ్ఞానభూమి పోర్టల్ నుండి స్టూడెంట్స్ ఇన్ఫోలోకి మార్పించడం ఆర్ఐఓ ,  డివిఈవో ల బాధ్యత అని తెలిపారు. వన్ టైం అవకాశాన్ని వినియోగించుకుని వాలంటీర్లు వారు చేసిన తప్పులని సరిదిద్దుకొవాలని , వాలంటీర్లు తప్పులు చేయకుండా సరైన సమాచారాన్ని వారి యాప్ లో అప్లోడ్ చేసే విధంగా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, జెడ్పి సీఈఓ మానిటర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి జి.ఈ.ఆర్  వివరాలను యాప్ లో అప్లోడ్ చేయవలసిందిగా ఎస్.ఎస్.ఏ అడిషనల్ పిడి ని ఆదేశించారు. 8వ తారీకు సాయంకాలం లోపల మొత్తం విద్యార్థుల వివరాలు యాప్ లో అప్లోడ్ చేసి జి. ఈ .ఆర్ వంద శాతము సాధించాలని  కలెక్టర్ పేర్కొన్నారు. ఏ మండలంలో నైనా విద్యార్థులు బడి, కాలేజీ బయట ఉన్నట్లయితే ఆ మండల విద్యా శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.

About Author