సామూహిక నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయండి: ఫ్యాప్టొ
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ఫ్యాప్టో సంఘం పిలుపుమేరకు ఆగస్టు 12 న కర్నూలు జిల్లా ఫ్య ప్టో ఆధ్వర్యంలో జరిగే 12 గంటల సామూహిక నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక సలాం ఖాన్ యస్.టి. యు భవన్ లో కర పత్రాలు రాష్ట్ర ఫ్యాక్టోపో చైర్మన్ ప్రకాష్ రావు గారు , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హృదయ రాజు గారు జిల్లా FAPTO చైర్మన్ ,సెక్రటరీ జనరల్ యస్. గోకారీ జి.తిమ్మప్పలు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో గల్లి గళ్లిన సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేస్తామని హామీ ఇచ్చారని ఇప్పటికి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా హామీ నెరవేర్చలేదన్నారు. ఎన్నికలలో ఎటువంటి హామీ ఇవ్వకపోయినా రాజస్థాన్, పంజాబ్ చత్తీస్గడ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాలు ఓ పి ఎస్ అమలు చేసే దిశలో ఉన్నాయన్నారు .అక్కడ సాధ్యమైనటువంటిది ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని,ప్రాథమిక వ్యవస్థను నిర్వీర్యం చేసే జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలని ,పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వైఖరి మార్చుకోవాలని ,ఉమ్మడి సర్వీసులను వెంటనే అమలుపరిచి జేయల్ గా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఎస్టియు నుండి టీ కే జనార్ధన్,శేఖర్,నాగరాజు,గోవింద్ నాయక్,దేవదాస్, సురేష్,ఏపీటీఎఫ్ 1938 నుండి మరిఆనందం బి టి ఏ నుండి సుధాకర్ నందీశ్వరుడు యుటిఎఫ్ నుండి జయరాజు లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.