మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి
1 min read– జనసేన పార్టీ డిమాండ్
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ మోడల్ స్కూలు, కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రాజశేఖర్ ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్ కళాశాల ఎంతోకాలంగా, ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ కారణంగా సబ్జెక్టులము బోధించే సిబ్బంది లేక విద్యార్థులు భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. ఖాళీగా పోస్టులను భర్తీ చేయాలని ఇటీవల జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. ఈ విషయమై పత్తికొండ శాసనసభ్యురాలు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారికి సైతం సైతం తెలియజేశామని అన్నారు. కానీ ఇంతవరకు ఈ స్కూల్, కళాశాలలో ఉపాధ్యాయ ఉపాధ్యాయ, ఆధ్యాపక సిబ్బందిని నియమించలేదని తెలిపారు. కావున ఇప్పటికైనా స్థానిక మోడల్ స్కూల్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉపాధ్యాయ, అధ్యాపక సిబ్బందిని నియమించాలని ఆయన కోరారు. లేని యెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టరేట్ ముందునిరసనకార్యక్రమాలుచేపడతామని హెచ్చరించారు. పిల్లలకు మేనమామ అని పిలిపించుకునే జగన్మోహన్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి అనేది ఏమాత్రం ఉన్నా మోడల్ స్కూల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, ఆధ్యాపక సిబ్బందిని నియమిస్తారని ఆశాభవం వ్యక్తం చేశారు..స్కూల్స్ ఓపెన్ చేసి ఇప్పటికే 50 రోజులు అయినప్పటికీ ఇప్పటివరకుఎందుకుమీరునియమించలేకపోయారని జనసేన పార్టీ తరఫున సూటిగా అడుగుతున్నామని ప్రశ్నించారు.ఈ పాఠశాల నందు TGT MATHS, PGT MATHS,PGT BOTANY, PGT ZOOLOGY,COMPUTER TEACHER పోస్టులు, అలాగే ,Office staff, Junior assistant, Data entry operator, Hostel staff Warden Cook పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. దీంతోఈ స్కూల్లో చదువుతున్న 700 మంది విద్యార్థులు చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.మరి కొందరు విద్యార్థులు చదువుకోలేక మధ్యలోనే ఆపేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ స్కూల్ కి వెళ్దామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పిల్లల తల్లిదండ్రులు బాధపడుతూ ఇదే స్కూల్లో టీచర్స్ వస్తారని ధైర్యంతో అలాగే కొంతమంది స్టూడెంట్స్ ను కొనసాగిస్తున్నారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో మరికొందరు విద్యార్థులు టీషీలు తీసుకువెళ్లి వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నారని పేర్కొన్నారు, గత సంవత్సరం పూర్తిగా maths టీచర్ లేనందువల్ల ఆరవ తరగతి నుంచి,తొమ్మిదవ తరగతి వరకు బోధించేవారు లేక ఇప్పటికే ఒక సంవత్సరం పిల్లలు విద్యను కోల్పోయారు అన్నారు. ఇప్పటికైనా మోడల్ స్కూల్లో ఉపాధ్యాయ అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు. నేను ఎడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, ఇస్మాయిల్, వడ్డే వీరేష్, రవికుమార్, నాగ, భూమేష్, పాల్గొన్నారు.