21.1 కోట్ల రూ. అభివృద్ధి పనులకు శంకుస్థాపన
1 min read– ఘనస్వాగతం పలికిన జిల్లా అధికారులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు రైల్వే స్టేషన్ లో 21.1కోట్ల రూపాయలతో చేపట్టనున్న స్టేషన్ అభివృద్ధి పనులకు రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదివారం శంకుస్థాపన చేసారు. ఉదయం విజయవాడ నుంచి ఏలూరు చేరుకున్న గవర్నరు కు జిల్లా కలెక్టర్ , జిల్లాపరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ ఇతర అధికారులు పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏలూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటుచేసిన కార్య్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ నుండి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశం కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. అనంతరం ఏలూరు రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, డిఐజి జి. వి. జి అశోక్ కుమార్ , ఎస్పీ మేరీ ప్రశాంతి, రైల్వే డి ఆర్ ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్, సీనియర్ డి సి ఎం వావిలాలపల్లి రబాబు, సీనియర్ డిఈఎన్ ఎస్. వరుణ్ బాబు, సీనియర్ డి ఓ ఎం నరేంద్ర వర్మ, సీనియర్ డి. ఎస్. సి. వల్లేశ్వర్ బాబ్జి తొక్కల, ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్, జడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ , ఎం ఎల్ సి వంకా రవీంద్రనాథ్, మాజీ ఎంపీ మాగంటి బాబు, ప్రభృతులు పాల్గొన్నారు.