రైతులది, చేనేతలది ఒకే దీనా గాధలు!!.
1 min readదేశం కోసం త్యాగం చేసిన చేనేతలు..
‘చే బదులు’ కోసం ఇతరుల దగ్గర ‘చేతులు సాచే’
పరిస్థితులలో మార్పు తెచ్చే నాయకత్వం కావాలనీ,
చేనేతలో పేదరిక స్థాయిని..
తగ్గించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలనీ
జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు,
శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు: “జాతీయ చేనేత” దినోత్సవం సందర్భంగా..ఎమ్మిగనూరు పట్టణంలో రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షులు, శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ గ ఆధ్వర్యంలో… పేద చేనేత కళాకారులను సన్మానించి, నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. రైతులది, చేనేతలది ఒకటే దీనా గాధలే!!. రైతు బాధలు కనపడతాయి. చేనేత వెధలు కనబడవనీ ఆయన విచారం వ్యక్తం చేశారు.చేనేతకు జరుగుతున్న అన్యాయంపైదేశవ్యాప్తంగా చర్చ కార్యక్రమం జరిగి, చేనేతలకు న్యాయం జరగాలని శ్రీ కొంకతి లక్ష్మీనారాయణఆశాభావం వ్యక్తం చేశారు. దేశ సాంస్కృతిక ఔన్నత్యానికి చేనేత చిహ్నం. అలాంటి చేనేతకు చెదలు పట్టే వ్యవస్థల నుంచి.. కాపాడేందుకు చైతన్యవంతమైన యువతీ, యువకులు ముందుకు రావాలని, ఆన్ని రాజకీయ పార్టీలు రాబోవు అసెంబ్లి పార్లమెంట్ ఎలక్షన్ లలో ఎమ్మెల్యే ఎంపీ టికెట్స్ కేటాయించాలి అని, ఈ సందర్భంగా… రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం పిలుపునిచ్చింది.