PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కలెక్టర్ చొరవతో దివ్యాంగుడుకి ఆధార్ నమోదు..

1 min read

– ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన మానసిక దివ్యంగుల తల్లిదండ్రులు..

– కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చొరవతో మానసిక దివ్యాంగుడుకు ఆధార్ నమోదు..

– ఇంటివద్దే ఆధార్ నమోదుతో ప్రభుత్వ పథకాలు అందుకోనున్న ఖాదర్ బాబు

పల్లెవెలుగు వెబ్​ ఏలూరు  :  కుక్కునూరు అదొక మారుమూల గిరిజన ప్రాంతం. జిల్లా కేంద్రానికి సుమారు 170 కి.మీ దూరంలో గోమ్ముగూడెం అనే  గిరిజన ఆవాసం ఆ ప్రాంతంలో పొనుగుపాటి మూతయ్య లక్ష్మి నిరుపేద దంపతులు మానసిక వికలాంగుడకు తల్లితండ్రులుగా ఉన్నారు. పుట్టినోడు మగ పిల్లాడని ఆ జంట సంతోషించిన విధి వక్రీకరించడంతో కుటుంభం అంత దిగులుపడ్డారు. అయితే పేగు బంధం వలన ఖాదర్ బాబు అని పేరుపెట్టి కంటికి రెప్పలా కాపాడుతూ 25 సంవత్సరాలు పెంచి పెద్దచేశారు. ఖాదర్ బాబు మానసిక వికలాంగుడు కావడంతో దినచర్యంతా మంచానికే పరిమితమయ్యింది. దేశంలోనే సంక్షేమ ఫలాల కి చిరునామా గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేదలకు, దివ్యంగులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతితంగా అర్హత ఉంటే చాలు ప్రభుత్వ లబ్ది సంతృప్తికర స్థాయిలో ప్రజలు అందుకుంటున్నారు. ప్రజా పక్షపతిగా పేరొందిన జగన్ ప్రభుత్వం పాలనలో దళారుల ప్రమేయం లేకుండా పారాధర్సికత తీసుకురావాలని ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందాలని ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది ప్రభుత్వం. దేశంలో ఆధార్ నమోదు ప్రక్రియ 2010లో ప్రారంభమైనా గత ప్రభుత్వాలు అలసత్వం వలన రాష్ట్రంలో నిరుపేదలు చాలా మంది ఆధార్ కేంద్రాలకు వెళ్లలేక నమోదు ప్రక్రియలో జాప్యం జరిగింది. ఫలితంగా అర్హత ఉన్నా రాష్ట్రంలో చాలా మంది నిరుపేదలు సంక్షేమ ఫలాలకు దూరమయ్యారు. కాగా 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా తర్వాత పాలనలో విప్లవత్మకమైన మార్పులు రావడంతో అనేక వ్యవస్థలు గాడిన పడ్డాయి. దానిలో భాగంగా ఆధార్ నమోదు కోసం పేదలు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగకుండా అవసరాన్ని బట్టి ఆధార్ మొబైల్ కిట్టును ఇంటివద్దకే పంపి అధికారులతో నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దానివలన ఖాదర్ బాబు లాంటి చాలా మంది మానసిక వికలాంగుల కుటుంబాలకు ఊరట లభించింది. అయితే ఇంటివద్దే ఆధార్ నమోదు సౌలభ్యం తెలియని ముతయ్య, లక్ష్మీ దంపతులు ఖాదర్ బాబును భుజాన్ని మోసుకొని 100 సార్లు పైబడి ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా  తమ కుమారుడు ఖాదర్ బాబుకు ఆధార్ నమోదు చేయించ లేకపోయారు. వ్యక్తి ఆధార్ నమోదుకు ఫోటో, వేలిముద్రలు, ఐరిష్ అవసరం అయినందున మానసిక వికలాంగుడైనా ఖాదర్ బాబు అవయవాలు సహకరించక పోవడంతో ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆధార్ నమోదు జరగలేదు. ఫలితంగా ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చే వైస్సార్ పింఛన్ కనుక నగదు అందక కుటుంబం బాధపడుతూ వచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి బాధితులని ఓదార్చాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడంతో ఏలూరు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.  సియం పర్యటన సన్నాహా కార్యక్రమాలలో భాగంగా జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ గోమ్ముగూడెం సందర్శనలో ఖాదర్ బాబుకు పింఛన్ అందడం లేదన్న విషయాన్ని తెలుసుకున్నారు.  సందర్బంగా ఆధార్ నమోదు కాకపోవడం వలన పింఛన్ రావడం లేదని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, మొబైల్ ఆధార్ కిట్టుతో ఖాదర్ బాబు ఆధార్ నమోదు ఇంటివద్దే చేయించాలని జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ను ఆదేశించారు. సందర్బంగా డిపిఓ విశ్వనాధ్ తన బృందంతో 14 గంటలు శ్రమించి 110 సార్లు ఆధార్ నమోదు ప్రక్రియ విఫలయత్నం చేసారు. ఫలితం లేకపోవడంతో ఒక సందర్భంలో స్థానికులు మధ్యలో వదిలేయమని సలహా ఇవ్వగా తిరస్కరించిన  డిపిఓ, శ్రీనివాస విశ్వనాధ్ తన 121 ప్రయత్నంలో ఖాదర్ బాబు ఆధార్ ఎన్రోమెంటును విజయవంతంగా నమోదు చేసారు. ఖాదర్ బాబు ఆధార్ నమోదు ధ్రువీకరణ పత్రాలు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్వయంగా తన చేతుల మీద ముతయ్య లక్ష్మీ దంపతులకు ఇచ్చి త్వరలో ప్రభుత్వ పింఛన్ ఇస్తామని భరోసా కల్పించారు. పత్రాలు అందుకున్న ఖాదర్ బాబు తల్లితండ్రులు ముతయ్య లక్ష్మీ దంపతుల సంతోషానికి అవదులు లేవు. ఆనంద భాష్పలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని చెప్పి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది ఖాదర్ బాబు కుటుంబం. ఆధార్ నమోదుతో తన దివ్యంగ బిడ్డకు పింఛన్ రానుందని తెలుసుకొని జగన్ ప్రభుత్వం నిర్ణయం వలన ఇంటివద్దే ఆధార్ నమోదు ప్రక్రియ  జరగడం సంతోషంగా ఉందన్నారు. తన లాంటి నిరుపేదలకు, అభాగ్యులకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వర్ధిల్లాలని ముతయ్య లక్ష్మీ దంపతులు అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనలలో భాగంగా ఖాదర్ బాబును, కుటుంబ సభ్యులను కలుసుకోగా ఆ విధంగా స్పందించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మానసిక దివ్యాంగుడు ఖాదర్ బాబు విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకొని ఆధార్ నమోదు చేయించిన జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాధ్ ను అధికారులు, ప్రజలు అభినందించారు.

About Author