స్వచ్ఛంద సేవకులకు… అభినందన
1 min read– మెమోంటోలు అందజేసిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : కరోనా విపత్తులో మానవత దృక్పథంతో , నిస్వార్ధంగా సేవలందిన స్వచ్చంధ సేవకులకు అభినందనలు తెలిపారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పోలీసు యూనిట్ అధికారులతో శుక్రవారం డిజిపి గౌతమ్ సవాంగ్ ఐపియస్ ఎపి హెడ్ క్వార్డర్ నుండి కరోనా విపత్తులో సేవలందించిన స్వచ్చంధ సేవకులకు సన్మాన కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కరోనా సమయంలో స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు చేసిన సేవల(ఆక్సిజన్ సిలిండర్లు, అంబులెన్సులు, భోజన సదుపాయాలు, అంత్యక్రియలు) గురించి డిజిపికి తెలియజేశారు. పోలీసుల సహాకారంతో ఉత్సాహంగా సేవలందించామని స్వచ్చంద సంస్ధల వారు తెలియజేశారు.
సద్గురు దత్త కృపాలయం సేవలు.. భేష్…
కర్నూలు నగరంలోని పాతబస్తీ కి చెందిన స్వచ్చంద సేవకులైన సద్గురు దత్త కృపాలయం వారు చేస్తున్న సేవలను డిజిపి జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్ప డీజీపీకి వివరించారు. 8 సంవత్సరాల నుండి తమ వంతుగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషంట్లకు రోజూకు 1200 మందికి నిత్య అన్నదానం చేస్తున్నారన్నారు. గత 10 సంవత్సరాలు సద్గరు దత్త కృపాలయం వైకుంఠ స్మశాన వాటికిలో ఉచితంగా అంత్యక్రియలు చేస్తున్నారని తెలియజేశారు. సద్గరు దత్త కృపాలయం కు చెందిన ప్రెసిడెంట్ టి. శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ లు జి పుల్లాలరెడ్డి, డి. రాకేష్ లకు డిజిపి గారి ఆఫీసు నుండి పంపిన మెమోంటోలను అందజేసి , శాలువలతో జిల్లా ఎస్పీ సన్మానించారు. ఈ విడియో కాన్ఫరెన్సులో ఎఆర్ అదనపు ఎస్పీ రాధాక్రిష్ణ , స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, వేల్పేర్ ఆర్ ఐ సుధాకర్, ఎస్పీ గారి పిఎ నాగరాజు పాల్గొన్నారు.