రైతులు వరి పొలంలో మెళుకువలను పాటించాలి
1 min read– మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు వరి పొలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన మెలుకువల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి అన్నారు, మండలంలోని బయనపల్లె యూనిట్ అలాగే రామనపల్లి గ్రామ పొలాలలోని వరి పొలాలను సోమవారం వ్యవసాయ అధికారి శ్రీదేవి, వెలుగు ఏపియం గంగాధర్ పరిశీలించారు, ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ, వరి పంటలలో జీవామృతం ఎలా వాడాలి, వరి పొలంలో మెలకువలు ఏ విధంగా పాటించాలి, చీడపీడల వలన పంటలను ఏ విధంగా కాపాడుకోవాలి వంటి విషయాలను వారు రైతులకు తెలియజేశారు, అదేవిధంగా పిలకల శాతం ఎక్కువగా రావాలంటే ఏం చేయాలి, పచ్చ దోమకు ఎలాంటి పిచికారి చేయాలి వంటి వాటిని రైతులకు తెలియజేశారు , ఈ కార్యక్రమంలో మండల పిఆర్పి మేరీ, యూనిట్ ఇన్చార్జి కే వెంకటయ్య, ఐ సి ఆర్ పి ,,ఏ. లక్ష్మి, పూజిత, ఎన్ సునీత, తదితరులు పాల్గొన్నారు.