చేనేత వృత్తికి గుదిబండ ఈ జిఎస్టి
1 min readపల్లెవెలుగు వెబ్ ఢీల్లీ: దేశ ఔన్నత్యానికి చిహ్నమైన ‘చేనేత’పై జిఎస్టి విధించడం దారుణమని, జిఎస్టి పూర్తిగా రద్దుచేసి.. చేనేతకు పునర్ వైభవం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, రాయలసీమ ప్రాంతీయ పద్మశాలి సంఘం అధ్యక్షుడు, శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా.. ఢిల్లీలో జరిగిన చేనేత డిక్లరేషన్ కాన్ఫరెన్స్లో.. శ్రీ కొంకతి లక్ష్మీనారాయణ తన వాణ్ణినీ ఈ విధంగా వినిపించారు. కేంద్ర ప్రభుత్వం జౌళి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత..చేనేతకు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. చేనేత అమ్మ లాంటిది.జౌళి పరిశ్రమ స్నేహితుడు లాంటిది.ప్రభుత్వాలు రెండింటిని ఒకే ఘాటున కట్టడం వల్లచేనేత కార్మికులకు అన్యాయం జరుగుతుందన్నారు.కేంద్ర బడ్జెట్లో చేనేత అభివృద్ధి కోసం..రూ.10 వేల కోట్లు కేటాయించాల్సిన విషయంలో..కేవలం రూ.200 కోట్లు కేటాయించడం విచారకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమమునకు MP లుశశి థరూర్, ఉత్తమ కుమార్ రెడ్డీ తెలంగాణ , అమర్ పట్నాయక్ ఒరిస్సా, వివేక్ మధ్యప్రదేశ్, నామా నాగేశ్వరరావు తెలంగాణ, పూనం కౌర్, కార్తిక్ చిదంబరం తమిళనాడు తదితరులు పాల్గొన్నారు.