ఘనంగా 9వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు , అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు సోమవారం ఉదయం తొమ్మిది గంటల 30 నిమిషాలకు చేనేత కార్మికుల ఆధ్వర్యంలో 9వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు .ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి నేతాజీ సర్కిల్ మీదుగా బస్టాండ్ వద్దకు ర్యాలీగా వెళ్లి ఎన్జీవో హోం నందు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు చేనేత కార్మికులు సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుదు విజయ భాస్కర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ప్రతి ఏడాదికి 24 వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇచ్చి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటున్నాడని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేతుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లు విజయ భాస్కర్ తెలిపారు వైసీపీ ప్రభుత్వం లోనే పేదలకు అనేక పథకాలు ప్రవేశపెట్టి బీసీలకు న్యాయం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వందే అని ఆయన అన్నారు .వైసిపి ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేక విధాలుగా లబ్ధి పొందారని ఆయన అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీరుస్తూ చేనేత కార్మికుల కష్టాలు గుర్తిస్తూ వైసిపి ప్రభుత్వం ప్రత్యేకంగా చేనేత కార్మికులకు ప్యాకేజీ ఏర్పాటు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నదని విజయభాస్కర్ అన్నారు .ఈ కార్యక్రమంలో ఏడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పిఎస్ గిరీష్ ఆదేశాల మేరకు చేనేత కార్మిక కావాల్సిన పనిముట్లు తదితర వస్తువులు ఎప్పటికప్పుడు పెండింగ్లో లేకుండా పరిష్కరిస్తున్నట్లు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు .ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ రెడ్డయ్యా, రాష్ట తొగటవీర క్షత్రియ సేవ సంగం ప్రధాన కార్యదర్శి బామిషెట్టి కృష్ణమూర్తి, మదనపల్లి కౌన్సిలర్స్ మందపల్లి వెంకటరమణ ఎస్ వి రమణ,శివయ్య, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ శీలం రమణమ్మ , శీలం రమేష్,వీరబల్లి మాజీ ఎంపీపీ మోడం రెడ్డమ్మ ,అన్నమయ్య జిల్లా బిసి సేల్ అధ్యక్షుడు మోడెమ్ నాగభూషణం,ప్రధాన కార్యదర్శి సంజీవ,చేనేత నాయకులు నాగరాజ, అన్నమయ్య జిల్లా చేనేత కార్మిక సేవా సంఘం ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి వెంకటేష్, చిటేం రామచంద్ర,మాజీ సర్పంచ్ హరినాథ్,మందపల్లి వెంకటరమణ, పులాశెట్టి ఓబులేసు_నాగరాజ,జగదీష్,అనుంపల్లి రామచంద్ర,దప్పేపల్లి శీనువాసులు మోడెమ్ నాగరాజ,పురం శ్రీరాములు,జొక సురేంద్ర,మోడెమ్ రమేష్,కదిరి హరిప్రసాద్,భువనేశ్వర్, శివభాస్కర్,పలువురు పాల్గొన్నారు. చేనేత కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు దాదాపు 200 మంది పాల్గొన్నారు.