PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆగస్టు 15 లోపు ప్రయారిటీ బిల్డింగ్స్ నిర్మాణాలు పూర్తిచేసేలా చర్యలు చేపట్టండి

1 min read

ప్రభుత్వ ప్రయారిటీ బిల్డింగ్స్ నిర్మాణాలు ఆగస్టు 15 లోపల పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు స్వాధీనం చేసేలా చర్యలు చేపట్టండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన…

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ప్రభుత్వ ప్రయారిటీ బిల్డింగ్స్ నిర్మాణాలు ఆగస్టు 15 లోపల పూర్తి చేసి సంబంధిత శాఖల అధికారులకు స్వాధీనం చేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో వివిధ ప్రభుత్వ పథకాల అమలు పై అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులతో  జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన సమీక్ష నిర్వహించారుఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రయారిటీ భవనాలకు సంబంధించి ఎమ్మిగనూరు, గోనెగండ్ల ,కోడుమూరు ,ఓర్వకల్లు, క్రిష్ణగిరి ,పత్తికొండ, వెల్దుర్తి మండల ఇంజనీర్లు వారి పనులలో కేవలం 50 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారని,  నిర్దేించబడిన 160 ప్రియార్టీ బిల్డింగ్ ల పనులు పూర్తి చేయాలని అందరు ఇంజనీర్లకు అదేశించారు.  పెయింటింగ్ తో సహా ఈనెల ఆగస్టు 15 తారీకు లోపల సంబంధిత ప్రభుత్వ అధికారులకు అందజేయలని ఆదేశించారు. ప్రయారిటీ బిల్డింగ్ లకు కరెంటు , నీటి సదుపాయము లేదు అని భవనాలును స్వాధీనం చేసుకోవడానికి తిరస్కరించరాదని వ్యవసాయ శాఖ అధికారి,డి ఎం &  హెచ్ ఓ లకు అదేశించారు. కరెంటు , నీటి వసతి ఏర్పాట్లు ఇంజనీరింగ్ వారి బాధ్యత కాదని ఆ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత మీదే అన్నారు.హౌసింగ్ కి సంబంధించి  ఆలూరు ,ఎమ్మిగనూరు, ఆదోని మొదలగు 12 మండలాలు గృహ నిర్మాణంలో వెనుకబడి ఉన్నాయని , తెర్నేకల్లు  జగనన్న లేఅవుట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని తెలిపారు. కేటాయించబడిన 15,634 గృహాలకు కాను 14,444 గృహాలు పూర్తి అయినాయని 223 లే అవుట్ లకు స్వాగత ద్వారాలకు సాంకేతిక అనుమతులు ఇంకా పూర్తి కాలేదని హౌసింగ్ పిడి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వచ్చారు.  మీకు ఇచ్చిన టార్గెట్ ఎందుకు పూర్తి చేయలేదని  దేవనకొండ ఎంపీడీవో ని ఆరా తీశారు, ఎంపీడీవో నుండి సరైన సమాధానం రానందున అలాగే ప్రతి ప్రభుత్వ పనులయందు ఎంపీడీవో  అలసత్వం వహిస్తున్నారని అందుకు గాను   శోకాజ్ నోటీస్ జారీ చేయవలసిందిగా జడ్పీ సీఈవో గారిని ఆదేశించారు. ఆలూరు ఎంపీడీవో ,కృష్ణగిరి ఎంపీడీవో ,గూడూరు అర్బన్ మున్సిపల్ కమిషనర్ ల పరిధిలో  ఉన్న ఇంజనీర్ అసిస్టెంట్ లు  పనులు సరిగా చేయనందున మరియు ఇంకా మొత్తం తొమ్మిది మండలాల ఇంజనీర్ అసిస్టెంట్ లు   నిర్దేశించిన పనులు పూర్తి చేయనందున వారికి ఛార్జ్ షీట్ ఇవ్వాలని సంబంధిత ఎంపీడీవోలను ఆదేశించినారు. పత్తికొండ-2 ఇంజనీరింగ్ అసిస్టెంట్ కు నిర్దేశించిన 102 గృహాల గాను ఒకటి కూడా ఏడు రోజుల్లో మొదలు పెట్టని కారణంగా అతనిని వెంటనే సస్పెండ్ చేయవలసిందిగా ఎస్ ఈ పిఆర్ ని ఆదేశించారు. అతని స్థానంలో వేరొకరిని పనులు చూడటానికి ఏర్పాటు చేసుకోవాలని ఎంపీడీవో గారిని ఆదేశించారు. వెల్దుర్తి ఇంజనీరింగ్ అసిస్టెంట్ తనకు కేటాయించబడిన 85 గృహాలకు గాను ఒకటి కూడా ప్రారంభించినందున అతని జీతాన్ని ఆపవలసిందిగా ఎంపీడీవోను ఆదేశించారు.విద్యా శాఖ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకు సంబంధించి 10,514 క్లస్టర్స్ ఉండగా అందులో 7,275 వాలంటీర్లు సర్వే పూర్తి చేయడం జరిగిందని, మిగితా వాటిని కూడా త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సర్వేలో కొన్ని లోపాలు నమోదు చేసినందున ఉన్నతాధికారులతో మాట్లాడి రోల్ బ్యాక్ ఆప్షన్ ఇవ్వడం జరిగిందని అయినప్పటికీ తుగ్గలి, మద్దికెర మండలాలలో వాలంటీర్లు తప్పుగా నమోదు చేస్తున్నారని, సదరు వాలంటీర్లు, ఎంపిడిఓలపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇంకా ఇంత వరకు 500 మంది సదరు ఆప్షన్ ను సద్వినియోగం చేసుకోలేదని దానిని ఉపయోగించుకొని సర్వేలో ఏమైనా లోపాల ఉంటే సరిచేయడంతో పాటు రేపు మధ్యాహ్నం నాటికి సర్వే పూర్తి చేయాలన్నారు. అదే విధంగా స్కూలు డ్రాప్ ఔట్స్, సిస్టమ్ డ్రాప్ ఔట్స్, పదవ తరగతి తప్పిన విద్యార్థులు, ఇంటర్మీడియేట్ విద్యార్థుల వివరాలను సంబంధిత పోర్టల్ నందు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని డిఈఓ, ఆర్ఐఓను కలెక్టర్ ఆదేశించారు.ఉపాధి హామీ పనులకు సంబంధించి హార్టికల్చర్ ప్లాంటేషన్ ను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలన్నారు. గతంలో పెండింగ్ ఉన్న పనులను కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఎంపిడిఓలు బార్కో యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు చివరి నాటికి ఆధార్ అథెంటికేషన్, ఆధార్ సీడింగ్ పూర్తి చేయాలన్నారు. అజాదీ కా అమృత్ సరోవర్ పథకంలో భాగంగా నా మట్టి – నా దేశంకు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ నందు కూడా శిలా ఫలకలు ఏర్పాటు చెయ్యాలని, ఈ కార్యక్రమాన్ని గ్రామ సమైక్యత కోసం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సదరు విషయంపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డ్వామా పిడి ని ఆదేశించారు.

జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ జిఓఎంఎస్ నెం.133 ప్రకారం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్టర్, డిపిఓ సభ్యులుగా, మండల స్థాయిలో తహశీల్దారు, ఎంపిడిఓ, సబ్ ఇన్స్పెక్టర్ సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమిటీ ద్వారా భూతగాదాలు, కుటుంబ సభ్యుల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అందుకు గాను ప్రతి శనివారం మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయాలను మినిట్స్ రూపంలో సోమవారం నాటికి అందజేయాలని సిపిఓను జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. మండల స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నందు 15 రోజులలోపు పరిష్కారం కానీ సమస్యలు జిల్లా స్థాయి కోఆర్డినేషన్ కమిటీ నందు పరిష్కరించడంతోపాటు వాటి వివరాలను జగనన్నకు చెబుదాం పోర్టల్ నందు నమోదు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జగనన్నకు చెబుదాం సంతృప్తి శాతాన్ని మెరుగుపరిచేలా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలన్నారు.ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు 42 వార్డులు, 1 సర్పంచ్ స్థానం (కౌతాళం మండలం, బదినేహళ్ గ్రామ పంచాయతీ) స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, అందుకుగాను ఆగస్టు 8వ తేది నుంచి 10వ తేది వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, 11వ తేదిన నామినేషన్ల, పరిశీలన, 12వ తేది ఆపిల్స్ తీసుకోవడం జరుగుతుందని, 14వ తేది నామినేషన్లు ఉపసంహరణ, 19వ తేది ఎన్నికల నిర్వహించడం జరుగుతుందన్నారు. ఏ గ్రామాల్లో అయితే ఎన్నికలు నిర్వహిస్తారో సదరు గ్రామాల వరకు మాత్రమే కోడ్ వర్తిస్తుందన్నారు.సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author