PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రెవెన్యూ డివిజన్ లో కార్మిక భవన్ ను ఏర్పాటు చేయాలి 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ రెవెన్యూ డివిజన్ లో  “లేబర్ కార్యాలయం”ఏర్పాటు చెయ్యాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారంస్థానికRDO‌కార్యాలయంముందు ధర్నా నిర్వహిం చారు.  ఏఐటీయూసీ తాలూకా అధ్యక్షులు జి.నట్టెకంఠయ్య అధ్యక్షత వహించగా,ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్ క్రిష్ణయ్య, సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్, ఏఐటియుసి తాలూకా కార్యదర్శియం రంగన్నలు పాల్గొని, ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ, పత్తికొండ రెవెన్యూ డివిజనై దాదాపు సంవత్సరం కావస్తున్నా లేబర్ ఆఫీసు కార్యాలయం ఏర్పాటు చేయలేదన్నారు.పత్తికొండకు సమీపాన తుగ్గలి ,మద్దికేర, ఆస్పరి, దేవనకొండ మండలాలు ఉన్నాయని డివిజన్ కేంద్రంలో ప్రజలు నిత్యం పనుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వస్తూ తమ పనులు చేసుకుంటూ లేబర్ ఆఫీసు పనులకోసం ఆలూరుకి ‌వెళ్ళవలసి‌ వస్తుందని వాపోయారు. డివిజన్ కేంద్రంలో లేబర్ కార్యాలయం లేనందున సుదూరంలో ఉన్న‌ ఆలూరులో లేబర్ ఆఫీసుకు వెళ్ళి పనులు చేసుకోవడానికి కార్మికులు త్రీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.పత్తికొండ రెవెన్యూ డివిజన్ లో లేబర్ ఆఫీసు కార్యాలయం ఏర్పాటు చేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.భవన నిర్మాణ కార్మికులకు1996 సంక్షేమ చట్టం తీసుకురావడం శుభ పరిణామమని అన్నారు. కానీ ఈ చట్టం అమలు చేయడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. మన రాష్ట్రంలో 2006 సంవత్సరంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డును వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలు ప్రతి కార్మికుడికి అందే విధంగా రాష్ట్ర బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు. ప్రస్తుత జగన్మోహన్ రెడ్డిి పాలనలో    సంక్షేమ బోర్డు ద్వారా ప్రభుత్వము కార్మికులకి అందాల్సిన సంక్షేమ పథకాలను  అమలు చేయాలేదని అన్నారు. ఇప్పుడు ఉన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  పేదలకు, కార్మికులకు, కర్షకులకు అండగా ఉంటానని చెప్పి 2019లో అదికారంలోకివచ్ఛినప్పటి నుండి ఇంతవరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదని వారు తెలిపారు.సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకి అందాల్సిన సంక్షేమ పథకాలు కోసం చాలా మంది కార్మికులు అప్లికేషన్లు పెట్టుకున్నారన్నారు. అయినా  ఇంత వరకు  కార్మికులకు సంక్షేమ ఫలాలు అందలేదన్నారు. ఇప్పటికైనా  ప్రభుత్వం తక్షణమే‌ సంక్షేమ బోర్డులో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేసి, పెండింగ్ లో ఉన్న క్లైయిమ్స్ ను వెంటనే పరిష్కరించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులు  రాష్ట్రంలో 20 లక్షల.60 వేల మంది. వరకు సంక్షేమ బోర్డు లో పేర్లు నమోదు కాబడి వున్నారు. భవన నిర్మాణానికి సంబంధించి ఇసుక, స్టీల్, కంకర తదితర ‌వస్థువుల ధరలు పెరగడం వల్ల కార్మికులకు పనులు లేక ఉపాది కోల్పోయి కుటుంబాలు పూట గడవక దుర్బర జీవితాలను గడుపుతున్నారని అన్నారు . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల గురించి పట్టించుకోకపోవడంతో  భవన నిర్మాణ కార్మికుల పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాం తక్షణమే లేబర్ ఆఫీస్ లలో  ఖాలీగా వున్న అన్ని రకాల  ఉద్యోగాలను భర్తీ చెయ్యాలనిి, భవన నిర్మాణ కార్మికులకు పెండింగులో ఉన్న క్లెయిమ్స్ అన్ని పరిష్కరించి, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు.పత్తికొండ లో లేబర్ ఆఫీసు కార్యాలయం ఏర్పాటు చేయాలని, భవన నిర్మాణ కార్మికులకు 55 సంవత్సరాలు దాటిన ప్రతి కార్మికుని కి పెన్షన్ ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికులకు 10వ తరగతి ఉండాలనే  నిబంధనను తొలగించి పెళ్ళి కానుక ఇవ్వాలని  డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ధర్నా అనంతరం AOగారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి తాలూకా డిప్యూటీ కార్యదర్శి జి.గుండుబాష. ఏఐటీయూసీ తాలూకా గౌరవ అధ్యక్షులు బి మాదన్న .ఏఐటీయూసీ తాలూకా ఉపాధ్యక్షులు యం.రాజప్ప, భవన నిర్మాణా కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు యస్ షేక్షవలి, బిటి.వీరేష్,  ఉపాధ్యక్షులు  జి.రసూల్ , రవి,జల్లరంగన్న  బి.టి.వీరేష్,  సహాయ కార్యదర్శి -మసాల రమేష్, సి.రంగస్వామి ,భూమ,  రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు .

About Author