ఈనెల 20 కి ఇంటింటి సర్వే పూర్తి చేయాలి
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది : ఈనెల 20 తేదీ నాటికి ఇంటింటి సర్వే బిఎల్వోలు పూర్తి చేయాలని మండల తహసిల్దార్ జనార్ధన్ శెట్టి బి ఎల్ వో లకు ఆదేశాలు జారీ చేశారు. మహానందిలోని తాసిల్దార్ కార్యాలయంలో బి ఎల్ వో మరియు పంచాయతీ కార్యదర్శులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రామాల్లో బి ఎల్ ఓ ల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఇంటికి తిరిగి అర్హులైన ఓటర్లను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని మార్పులు చేర్పులు ఉంటే వెంటనే సరిదిద్దాలని సూచించారు. అనర్హుల ఓట్లు ఉంటే వాటిని కూడా తొలగించాలన్నారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు నమోదు కాకున్నా పార్టీలకు అతీతంగా నమోదు చేయాలన్నారు. చనిపోయిన వారివి డబుల్ ఓటర్లు గుర్తించి తొలగించాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని బిఎల్ఓ లను మరియు పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహానంది మండలంలో 12,798 గృహాలు ఉన్నట్లు తెలిపారు. 29వేల 512 మంది ఓటర్లు ఉన్నారని ఇందులో 4,513 మంది పురుషులని 14,929 మంది మహిళలు మరియు పదిమంది ట్రాన్స్ జెండర్స్ ఓటర్లుగా 39 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు తాసిల్దార్ జనార్దన్ శెట్టి పేర్కొన్నారు. గ్రామాల్లోని ప్రజలు సహకరించాలని తాసిల్దార్ కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు ఆర్ ఐ శ్రీనివాస్ రెడ్డి వీఆర్వోలు మరియు పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల బిఎల్వోలు పాల్గొన్నారు.