ఆలయ క్యూలైన్ల పరిశీలన ..ఈఓ
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: ప్రముఖపుణ్యక్షేత్రమైన శ్రీశైలమహా క్షేత్రంలో ఈ నెల 17.నుండి శ్రావణమాసోత్సవాలు నిర్వహించబ డనున్నాయి. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని సౌకర్యాలను వివిధ విస్తృత ఏర్పాట్లు ఆలయ అధికారులు చేయబడుతున్నాయి.పరిశీలనలో భాగంగా ఈవో ఇఓ లవన్న ఈ ఈ రామకృష్ణ క్యూకాంప్లెక్స్, సిబ్బందిపారిశుద్ధ్య విభాగ అధికారులతో కలిసి క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ఆర్జితసేవా క్యూలైన్లను, శీఘ్రదర్శనం మరియు అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు, విరాళాల సేకరణ కేంద్రం, మొదలైన వాటిని పరిశీలించారు. స్వామివారి స్పర్శదర్శనం, మరియు వివిధ ఆర్జితసేవలకు శీఘ్రదర్శనం, అతి శీఘ్రదర్శనాలకు కూడా వేరు వేరు క్యూలైన్లను ఏర్పాటు చెయ్యనున్నారు భక్తులకు దర్శనం త్వర త్వరగా అయ్యేవిధంగా కంపార్టుమెంట్లను పెంచాలన్నారు క్యూలైన్లను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని పారిశుద్ధ్య సిబ్బందికి ఇఓ ఆదేశించాడుభక్తులకు దేవస్థానం నిర్వహిస్తున్న విరాళాల పథకాల గురించి వివరంగా దాతలకుతెలియజేయాలన్నాడుశీఘ్రదర్శనం (రూ.150/-ల రుసుముతో అతిశీఘ్రదర్శనం (రూ.300/-ల రుసుముతో) కొనసాగతాయి. ఈ శీఘ్రు, అతిశీఘ్రు దర్శనం 70 శాతం టికెట్లను ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంచుతున్నారు భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 12వ తేదీ నుంచి సెప్టెంబరు 15వ తేదీ వరకు అంటే శ్రావణమాసం ముగిసేంత వరకు వచ్చే శని, ఆది, సోమవారాలు మరియు పర్వదినాలు / సెలవురోజులైన స్వాతంత్య్ర దినోత్సవం | 15.08.2023), వరలక్ష్మీవ్రతం 25.08.2023), శ్రావణపౌర్ణమి [31.08.2023) శ్రీ కృష్ణాష్టమి (06.09.2023) రోజులలో శ్రీస్వామివారి గర్భాలయ అబిషేకాలు మరియు సామూహికఅభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అభిషేకాలు నిలుపుదల చేసిన ఈ నిర్ధారిత రోజులలో రూ. 500/-ల రుసుముతో శ్రీస్వామివార్ల స్పర్శదర్శనానికి అవకాశం కల్పించబడింది. రోజుకు నాలుగు విడతలలో స్పర్శదర్శనం కల్పించబడుతుంది. ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే స్పర్శదర్శనం టికెట్లు మరియు ఆర్జితసేవా టికెట్లను భక్తులు ఆన్లైన్ద్వారా దేవస్థానం వెబ్ సైట్ నుంచి పొందాల్సి వుంటుంది. భక్తులు మరింత సులభతరంగా టికెట్లను పొందేందుకు వీలుగా అందుబాటులోకి తెచ్చిన దేవస్థానంయాప్ నుంచి కూడా ఆయా టికెట్లను పొందవచ్చు.టికెట్లను బట్టి ఒక గంట ముందువరకు కూడా భక్తులు ఆన్లైన్ ద్వారా ఆయా టికెట్లనుపొందే వీలు కల్పించబడింది.. అదేవిధంగా ఆర్జితసేవా కర్తలు మరియు స్పర్శదర్శనం టికెట్ పొందిన వారు విధిగా వారు ఆన్లైన్ ద్వారా పొందిన టికెట్ ప్రింట్ కాపీని ( హార్డ్ కాపీని) వెంట తెచ్చుకోవలసి వుంటుంది. మంగళ, బుధ, గురు, శుక్రవారాలలో మధ్యాహ్నం గం. 2.00ల నుంచి ఉచిత స్పర్శదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. ఆన్లైన్ ద్వారా వివిధ టికెట్లు తీసుకున్న భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు కార్డు గుర్తింపు ప్రతిని ఒరిజినల్ లేదా జిరాక్స్ ప్రతిని) తీసుకుని రావలసి వుంటుంది. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు మరియు ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.