PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ధన్వంతరి హాల్లో వైద్య అధ్యాపకులతో సమీక్ష సమావేశం

1 min read

– ఆసుపత్రి సూపరింటెండెంట్,డా.V.వెంకటరంగా రెడ్డి,  మాట్లాడుతూ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ధన్వంతరి హాల్లో పలు విభాగాల వైద్య  అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఆస్పత్రిలోని వైద్య అధ్యాపకులతో సమీక్ష నిర్వహించి, అనంతరం వారు మాట్లాడుతూ వైద్యధ్యాపకులు ఆసుపత్రి సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలనతో విధులు నిర్వహిస్తూ ఉండాలని మరియు ఆసుపత్రిలోని ఓపి మరియు ఐపి విభాగాల్లో  వైద్యులు మరియు సిబ్బంది అందుబాటులో ఉండాలని  హెచ్ఓడిలకు తెలియజేశారు.ఆసుపత్రిలోని అన్ని  వైద్య అధ్యాపకులు వైద్యులు మరియు సిబ్బంది యొక్క FRS మరియు రిజిస్టర్ మెయింటెన్ చేయాలని హెచ్ఓడిసి కి తెలియజేశారు.ఆసుపత్రిలోని పేషెంట్స్ ను అవుట్ సైడ్ ఇన్వెస్టిగేషన్స్ లకు పంపకుండా తగు  చర్యలు తీసుకోవాలని HODs కు ఆదేశించారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాతిపతులతో ల్యాబ్ ఇన్వెసిగేషన్ కు సంబంధించి  పేషంట్స్ కు అందుబాటులో తీసుకురావడం కోసం ఈరోజు సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.ఆసుపత్రిలో  అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా మరీయు పేషెంట్ కు సక్రమంగా వైద్యం అందించాలని HODs కి ఆదేశించారు.ఆసుపత్రిలో హెచ్ఓడి స్ మీటింగ్ లో  వైద్య అధ్యాపకుల నుండి  వినతులను స్వీకరించి అనంతరం వారి వినతులను పరిష్కరించడానికి టీం వర్క్ చేస్తు ఆసుపత్రికి అవసరమైన మందులు మరియు ఇతరత్రా కొనుగోలు చేసి వారికి పరిష్కరిస్తానని తెలియజేశారు.ఆస్పత్రిలో త్వరలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన కర్నూలు వైద్య కళాశాల అడిషనల్ డిఎంఈ & ప్రిన్సిపల్, డా.సుధాకర్ఈ కార్యక్రమానికి ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్, డా.ప్రభాకర్ రెడ్డి, CSRMO, డా.వెంకటేశ్వరరావు, డిప్యూటీ CSRMO, డా.హేమనలిని, వైద్యధ్యాపకులు, డా.హరిచరణ్, డా.సీతారామయ్య, డా.మాధవి శ్యామల, డా.రేణుక, డా.రామ్ శివ నాయక్, డా.రాధారాణి, డా.శ్రీరాములు, RMO డా.వెంకటరమణ,  హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, మరియు తదితరులు  పాల్గొన్నట్లు, ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.V.వెంకటరంగా రెడ్డి, గారు తెలిపారు.

About Author