ప్రధానమంత్రి స్వానిధి వర్క్ షాప్ విజయవంతం…
1 min read– స్వామిది రుణగ్రహితులకు సర్టిఫికెట్లు, సత్కారం..
– మెప్మా పిడి డి ఇమ్మానియేల్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఎస్ఎల్ బిసి-ఎపి మరియు ఎపి-మెప్మా ఏలూరు వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్వానిధి వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ మెప్మా డి. ఇమ్మానియేల్, లీడ్ డిస్టిక్ మేనేజరు నీలాధ్రి, యూనియన్ బ్యాంకు రీజనల్ హెడ్ యంజికె మూర్తి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎజియం శివరాం, మరియు ఇతర బ్యాంకు మేనేజర్లు, మెప్మా సిబ్బంది, స్వానిధి రుణగ్రహితులు రావడం జరిగిందని మెప్మా పిడి డి. ఇమ్మానియేల్ మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వానిధి పధకం యొక్క ఉద్దేశ్యం పధకం ద్వారా లబ్దిపొందిన వారిని సత్కరించడం జరిగిందని పిడి చెప్పారు. ఈ కార్యక్రమంలో అత్యుత్తమ సేవలు అందించిన బ్యాంకర్లను మెప్మా సిబ్బందిని మరియు స్వానిధి రుణగ్రహితులకు సర్టిఫికెట్లు ఇచ్చి సత్కరించడం జరిగిందని ఇమ్మానియేల్ చెప్పారు.