ఉద్యోగుల సమస్యలపై స్పందించి పరిష్కరించండి.. జంపాన
1 min readపల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు: రాష్ట్రంలో 54 వేలమంది విద్యుత్ కార్మికులు రాష్ట్ర విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్న రాష్ట్ర ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీఆధ్వర్యంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వర్క్ టు రూల్, నిర్వహిస్తున్నందున సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రివర్యులు కి వినతి పత్రం సమర్పించారని ఒక ప్రకటన లోతెలియజేశారు.కృష్ణా జిల్లాలోనూ, రాష్ట్రంలోనూ ,రాత్రిపూట విద్యుత్ సరఫరా ఆగిపోతే విద్యుత్ పునరుద్ధరణ నిమిత్తం, వర్క్ టు రూల్ ప్రకారం విద్యుత్ సిబ్బంది స్పందించనందున , రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా రాష్ట్రంలోని 54,000 మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, క్షేత్రస్థాయిలో రాత్రి పగలు తేడా లేకుండా వర్షాలతో, వడగాల్పులతో , విద్యుత్ వినియోగదారులకు సేవలు అందిస్తున్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వై .ఎస్. జగన్మోహన్ రెడ్డి కి స్వయంగా విజ్ఞప్తి చేయడమైనదని ,సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.