మూగజీవాలకు మరణ మృదంగం.. ప్లాస్టిక్ వినియోగం
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: పాలకులు ప్రభుత్వాలు ఏటా ప్లాస్టిక్ నిషేధం అంటూ ఆదేశాలు జారీ చేసిన ప్లాస్టిక్ వినియోగం ఎక్కడ తగ్గటం లేదు పేపర్ బ్యాగులు జ్యూట్ బ్యాగులు వాడాలని పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ ని ఉపయోగించవద్దని నియంత్రించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న వాడకం మాత్రం ఆగడం లేదు వాడిన తర్వాత డిస్పోజ్ చేయకుండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్ధాలను పారవేస్తుండడంతో మూగజీవాలు తినడం వాటికి ప్రాణాంతకంగా మారాయి ఇదే సంఘటన గడివేములలో ఒక ఆవు ప్లాస్టిక్ కవర్ తినడం పల్లె వెలుగు కెమెరా కు చిక్కింది ఇప్పటికైనా మూగజీవాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కలుషితం చేయకుండా ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు బహిరంగ ప్రదేశాల్లో పార వేయకుండా కృషి చేద్దాం.