సామాజిక మార్పుకోసమే గద్దర్ తపన..
1 min read– మాల మహానాడు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు తాలూకా మాల మహానాడు కార్యాలయంలో తాలూకా అధ్యక్షులు శివప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రజాకవి గద్దర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పబ్బతి శివప్రసాద్ మాట్లాడుతూ తన కళలతో ప్రజలను చైతన్య పరచడానికి కృషి చేశారు. అనేక దశాబ్దాల పాటు యువతను ఉర్రూత లూగించారు. జానపద కళారూపాలకు విప్లవ సాహిత్యాన్ని జోడిరచి ప్రజా సంస్కృతి పట్టం కట్టారు. సామాజిక మార్పు కోసం తపన పడ్డారు. ఇందుకోసం నిర్బంధాన్ని అనుభవించారు. అణగారిన వర్గాలకోసం అనేక పాటలు రాయడంతో పాటు తన ఆట, పాట ద్వారా ‘ప్రజా యుద్ధనౌక’గా పేరుపొందారు. ఆయనపై హత్యాయత్నం సందర్భంగా ఇప్పటికీ వెన్నెముకలో తూటా ఉన్నా ఖాతరుచేయకుండా ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై తన గళాన్ని వినిపించారు. నాటి నైజాం నవాబు దాష్టీకాలను ఎండగడుతూ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ‘బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి’ పాట నేటికీ చిరస్థాయిగా నిలిచింది. ఆయన వేషధారణ ప్రజలను ఆకర్షించేది. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య జరిగిన శాంతి చర్చలలో కీలకపాత్ర పోషించారు. గద్దర్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో తాలూకా మాల మహానాడు ఉపాధ్యక్షులు పుల్లన్న ,మధు,నాయకులు డా. వెంకటేష్, రవికుమార్, సుబ్బయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.