సూక్ష్మ నీటి సాగు పథకం పై అవగాహన కార్యక్రమం
1 min readబిందు … తుంపర సేద్య పద్దతి పై మరియు పరికరముల పంపిణీ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉధ్యాన భవన్ లో “బిందు మరియు తుంపర సేద్య పద్దతి పై మరియు పరికరముల పంపిణీ కార్యక్రమము ఆంధ్ర ప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకము వారు నిర్వహించటము జరిగినది. ఈ కార్యక్రమమునకు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ శ్రీ బెల్లం మహేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనటము జరిగినది. ఈ కార్యక్రమములో పథక సంచాలకులు శ్రీమతి డి. ఉమాదేవి గారు మాట్లాడుతూ, జిల్లాలో అందుబాటులో వున్న సాగునీటి వనరుల సద్వినియోగానికి డ్రిప్ మరియు స్ప్రింక్లర్ యూనిట్లను ప్రభుత్వం ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై ప్రోత్సహించుచున్నదని తెలిపారు. 2023-24 సంవత్సరములో డ్రిప్ మరియు స్ప్రింక్లర్ యూనిట్లను అమలు పరుచుటకు గాను 5000 హెక్టర్ల బౌతిక లక్ష్యం నిర్దేశించడం జరిగినదని తెలిపారు. ఆంద్ర ప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకము ద్వారా అయిదు ఎకరాములలోపు రైతులకు 90% రాయితి పై మరియు అయిదు ఏకరముల పై బడిన రైతులకు 70% రాయితీ పై డ్రిప్ పరికరములను అందజేయటము జరుగుచున్నది. అదేవిధంగా, స్ప్రింక్లర్ యూనిట్లను అయిదు ఎకరాములలోపు రైతులకు 50% పై మరియు అయిదు (5) ఏకరముల పైబడిన రైతులకు 45% రాయితీ పై అందజేయటము జరుగుచున్నది తెలిపారు.2023-24 సంవత్సరమునకు గాను నిర్దేచించిన బౌతీక లక్షమునకు గాను, ఇప్పటి వరకు 11372 హెక్టార్లకు 10530 మండి రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగినదని తెలిపారు. వీటికి గాను, రైతుల నుంచి 1754 హెక్టార్లకు రైతు వాటా చెల్లించటము మరియు 1438 హెక్టార్లకు పరిపాలణ అనుమతులు జిల్లా కలక్టర్ గారి నుంచి పొందటాము జరిగినదని తెలిపారు. అందులో 900 రైతులకు 795 హెక్టార్ల మేరకు బిందు మరియు తుంపర పరికరములను సరఫరా చేయటము జరిగినదని తెలిపారు.ముఖ్య అతిథి గౌరవ శ్రీ. బెల్లం మహేశ్వర రెడ్డి గారు సమావేశముకు హాజరైన లబ్దిదారులతో పథకము అమలవుతున్న విదానముపై అడిగి తెలుసుకోవటం జరిగినది. కార్యక్రములో మాట్లాడుతూ, గ్రామాలలో నెలకొల్పిన రైతు భరోసా కేంద్రాల వలన రైతులకు చేరవలసిన పథకాలు సకాలములో చేరే అవకాశం వచ్చిందని తెలిపారు. సూక్ష్మ నీటి సాగు పథకము లో కూడా రిజిస్టర్ అయిన 14 కంపెనీల నుండి రైతులు తమకు నచ్చిన కంపెనీ నుంచి పరికరాలు తీసుకొనే వెసులుబాటు వున్నదని మరియు వాటి నిర్వహణ పై కూడా ప్రతి రైతుకు అవగాహన వుండాలని సూచించారు. నీరు చాలా విలువైనదని , దానిని సంప్రదాయ పద్దతిలో కాకుండా, ఆధునిక సాంకేతిక పద్దతిలో వచ్చిన బిందు పద్దతి ద్వారా వాడి నట్లయితే నీటి ఆదా కావటం తో పాటు, సాగు విస్తీర్ణము పెరుగుదల, పెట్టుబడి తరుగుదల మరియు నాణ్యమైన పంటను పొందే అవకాశం వుంటుందని తెలిపారు. కవునా సకాలములో ప్రభుత్వ పథకాలు ఉపయోగించు కోవాలని రైతులకు సూచించడం జరిగినది.. ఈ కార్యక్రములోడ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కర్నూల్, సి.బెళగల్, మరియు ఓర్వకల్ మండలాలలోని రైతులకు 9.29 హెక్టర్లకు గాను రూ. 7.39 లక్షల విలువ గల డ్రిప్/ స్ప్రింక్లర్ పరికరములు పంపిణి చేయడము జరిగినది. ఈ కార్యక్రములో పథక సహాయ సంచాలకులు శ్రీ. ఎ. రాజ కృష్ణ రెడ్డి గారు, మండల వ్యవసాయ అధికారి కల్లూర్ శ్రీ శ్రీనివాస రెడ్డి గారు, ఉద్యాన అధికారి కోడుమూరు శ్రీ మదన్ మోహన్ గారు, రైతు భరోసా గ్రామ వ్యవసాయ/ఉధ్యాన సహాయకులు, ఫినోలెక్స్ మరియు నింబస్ కంపెనీ ప్రతినిధులు, రైతులు పాల్గొనటం జరిగినది.