మహాసభ ద్వారా ఉద్యోగులకు మేలు జరగాలి..
1 min read– కష్టపడి పనిచేసి జిల్లాను మరింత అభివృద్ధి చేద్దాం..
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్
– ఆహ్వానం పలికిన జిల్లా ఎన్జీవోస్ అధ్యక్ష , కార్యదర్శులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ ,కార్యదర్శి నెరుసు రామారావు ల ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్జీవో 21 వ మహా సభలకు ఆహ్వానిస్తూ ప్రచురించిన 21 వ మహా సభల గోడ పత్రికను జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ వారీ ద్వారా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ 21 వ ఎన్జీవో సంఘం మహాసభలు జయప్రదం కావాలని ,ఈ మహా సభల ద్వారా ఉద్యోగులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.జిల్లా అభివృద్ధి లో ఉద్యోగులది కీలక పాత్రని.. కష్ట పడి పనిచేసి జిల్లా ను మరింత అభివృద్ధి చేద్దామని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్ రాజు, కె. సత్యనారాయణ.. ఉమెన్ వింగ్ చైర్ పర్సన్ కెనాగమణి.. జిల్లా,, ఏలూరు తాలూకా ఎన్జీవో సంఘ నాయకులు పూడి శ్రీనివాస్. నరేంద్ర, బేగ్, సాంబశివరావు రవికుమార్, సునీత,,కుసుమ కుమారి, లీలా రాణి. సత్య భారతి తదితరులు పాల్గొన్నారు.