మండల స్థాయి పాఠశాల భద్రత కమిటీ సమావేశం
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: మండల విద్యాశాఖాధికారి కార్యాలయం నందు బుధవారం మండల స్థాయి పాఠశాలల భద్రతా కమిటీ ఏర్పాటు సమావేశం నిర్వహించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ రాఘవరెడ్డి మాట్లాడుతూ ఇది ఒక బృహత్తర కార్యక్రమమని, ఈ కమిటీ నందు సభ్యులందరూ మండలంలోని అన్ని పాఠశాలలను తరచుగా సందర్శించి విద్యార్థి,విద్యార్థినులకు భద్రత కొరకు సూచనలు ఇవ్వాలని తెలిపారు, అంతేకాకుండా విద్యార్థులు పాఠశాలకు వచ్చే ముందు ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు, దీనికి సంబంధించి మండల స్థాయి కమిటీ ప్రమాదాల నివారణకు, విద్యార్థుల భద్రతకు భరోసా ఇచ్చే విధంగా తగు సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా ఆయన కోరారు, ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మండల అభివృద్ధి అధికారి గంగనపల్లి సురేష్ బాబు మాట్లాడుతూ పాఠశాలలను సందర్శించేటప్పుడు భద్రతోతో పాటు IFA,( ఐరన్ పోలిక్ యాసిడ్), అలాగే ఆల్బండాజోల్ టాబ్లెట్స్ కూడా విద్యార్థులకు అందే విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు, ఎందుకంటే విద్యార్థులకు ముఖ్యంగా పురుగుల వల్ల కడుపునొప్పి, రక్తహీనత, ఆకలి మందలించడం, వాంతులు, వీరేచనాలు వంటి వాటితో నీరసపడిపోతారని అలాంటప్పుడు ముందస్తుగానే విద్యార్థులకు ఇలాంటి టాబ్లెట్లను ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి సమస్య లేకుండా చూడడం జరుగుతుందని తెలిపారు , మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ లు మాట్లాడుతూ, ఈ కమిటి లో ఉన్నటువంటి సభ్యులు అందరు కూడా అన్ని పాఠశాలలు సందర్శించి, అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గం చూసే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమం ఎస్సై శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ప్రైవేట్ పాఠశాలలు కరెస్పాండెన్స్ పాల్గొన్నారు.