PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంబులెన్స్..లో గర్భిణీ ప్రసవం..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : అంబులెన్స్  వాహనంలో  గర్భిణీ ప్రసవించింది హోలగుంద మండలంలోని ఏడో వార్డుకు చెందిన  ఫిరదౌసి కి పురిటినొప్పులు రావడంతో హొళగుంద ఏడో వాడు చెందిన ఆశ కార్యకర్త జయలక్ష్మి 108 కి సిబ్బందికి సమాచారం ఇచ్చింది వెంటనే ఇఎంటి  బి. కె. యల్లయ్య, పైలెట్ N. S. వినోద్ కుమార్ ఏడో వార్డు వాహనం ను తీసుకొని వెళ్లి గర్భిణీ ని ఆదోని యంసిహెచ్​  హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుండగా మార్గ మధ్యలోనే సమయం ఉదయం 08:13 నిముషాలు కు నేరనికి మరియు ముద్దానగేరి మార్గ మధ్యలో నే ఆడ బిడ్డ కి జన్మనిచ్చింది. అనంతరంతల్లి, బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు ఈ మహిళ కి ఇది మొదటి కాన్పు, వీరిని ఆదోని యంసిహెచ్​   హాస్పిటల్ లో అడ్మిట్ చేశామని 108లో విధులు నిర్వహిస్తున్న ఇఎంటి బి. కె. యల్లయ్య తెలిపారు.గర్భిణీ బంధువులు సమాచారం తెలుసుకున్న వెంటనే ఆదోని యంసిహెచ్​   హాస్పిటల్ లో యల్లయ్య కు కృతజ్ఞతలు చెప్పినారు. ఇఎంటి యల్లయ్య వారితో డెలివరీ సమయం లో బిడ్డ పేగు మెడ వేసుకొని వచ్చింది అని, తల్లి, బిడ్డ ను క్షేమంగా కాపాడి, వారి ఆరోగ్యం క్షేమంగా ఉండడం చాలా సంతోషం గా ఉంది అని 108 లో డెలివరీ చేయడం ఇది 13 వ సారి అని ఇఎంటి బి. కె. యల్లయ్య తెలిపారు.

About Author