PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమీలియోలో..అరుదైన శస్ర్తచికిత్స

1 min read

– గుండె సమస్య ఉన్నా… కుళ్లిన పిత్తాశయంను తొలగించిన జనరల్ సర్జన్ డా. రామచంద్రయ్య

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తీవ్ర గుండె సమస్యతోపాటు కుళ్లిపోయిన పిత్తాశయంను  శస్ర్తచికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడారు నగరంలోని అమీలియో ఆస్పత్రి వైద్యులు. గురువారం అమీలియో ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి ఎండి లక్ష్మీ ప్రసాద్ చాపె మాట్లాడారు. అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన నాగార్జున (52) అనే వ్యక్తి ఆరోగ్యం బాగా లేక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గుర్తించిన సదరు ఆస్పత్రి వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైయర్ సెంటర్కు వెళ్లాలని సూచించారు. దీంతో రోగి నాగార్జున బంధువులు గత నెల 24వ తేదీన అర్ధరాత్రి 12.45 గంటలకు చికిత్స నిమిత్తం చేరారు. గుండె సమస్యతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్న రోగి నాగార్జునకు జనరల్ సర్జన్ డా. రామచంద్రయ్య వైద్య చికిత్స చేశారు. అలాగే పిత్తాశయంలో రాళ్లను తొలగించడంతోపాటు కుళ్లిన పిత్తాశయంను తొలగించి శస్ర్త చికిత్స చేశారు. శస్ర్తచికిత్సలో డా. లక్ష్మీ ప్రసాద్, డా. శిల్పా, డా. శ్రీనాథ్ పాల్గొన్నారు.

అత్యాధునిక …వైద్యం..

పిత్తాశయం అనేది మానవ పిత్త వ్యవస్థలో భాగమైన ఒక అవయవం. శరీరంలోని చిన్న ప్రేగులోని కొవ్వుపదార్థాలను విచ్చిన్నం చేయడానికి… జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. అటువంటి పిత్తాశయంలో రాళ్లు ఉండటంతో పాటు కుళ్లిపోయింది. తమ ఆస్పత్రిలో అత్యాధునిక పరికరాలతో పాటు అన్ని వ్యాధులకు సంబంధించి మెరుగైన వైద్యం అందించే వైద్య నిపుణులు నిత్యం అందుబాటులో ఉంటారని, అందు వల్లే రోగి నాగార్జునను కాపాడగలిగామని అమీలియో ఆస్పత్రి ఎం.డి. డా. లక్ష్మీ ప్రసాద్ తెలిపారు.  వైద్యసేవలో నిత్యం రిస్క్ అనేది ఉంటుందని, ఓ వైపు గుండె సమస్య ఉన్నా..సాధారణ స్థితికి తీసుకొచ్చి… పిత్తాశయంలో రాళ్లు తొలగించి.. శస్ర్తచికిత్స చేశామని ఈ సందర్భంగా అమీలియో ఆస్పత్రి ఎండి. డా.లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.

About Author