వేదవతి ప్రాజెక్టు కోసం 2 వ రోజు సామూహిక నిరాహార దీక్షలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: వేదవతి ప్రాజెక్ట్ కోసం సిపిఐ తలపెట్టిన సామూహిక నిరాహార దీక్షకు. TDP—RCC—ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) మండల జిల్లా నాయకులు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప టిడిపి మండల కన్వీనర్ డాక్టర్ తిప్పయ్య. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం (APVBS) జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ మాట్లాడుతూ హోళగుంద మండల కేంద్రంలో స్థానిక బస్టాండ్ నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వేదవతి ప్రాజెక్టు 8 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని నిలిచిపోయిన పనులను పునః ప్రారంభించాలని ఆలూరు నియోజకవర్గంలో 253 గ్రామాలకు సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని ప్రాజెక్ట్ పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రెండవ రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వేదవతి ప్రాజెక్ట్ పనులను వెంటనే పనులను పునః ప్రారంభించక పోతే రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి యువజన ప్రజాసంఘాలు వామపక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు ధర్నాలు రాస్తరోకలు నిర్వహిస్తామని ఈ సభ ముఖంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి రంగన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ రైతు సంఘం నాయకులు కృష్ణ మౌలా సాబ్ APVBS మండల అధ్యక్షుడు దిడ్డి తిక్క స్వామి టీడీపీ RCC APVBS నాయకులు దిడ్డి సిద్ధూ మల్లయ్య శ్రీను మంజునాథ్ గౌడ్ శివ శీను కార్తీక్ సిపిఐ ఏఐటీయూసీ నాయకులు నూర్ భాషా అబ్దుల్లా సలాం సబ్ ఇనాహిత్ ఇబ్రహీం ఎంకన్న అసిన్ భాష అశోక్. మహిళ సంఘం నాయకులు అధ్యక్షులు కార్యదర్శులు భూలక్ష్మి జాయిదమ్మ కృషిత్ బేగం మీనాక్షి వనజమ్మ నరసమ్మ బసమ్మ సామ్య తదితరులు పాల్గొన్నారు.