PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

12న జరగనున్న ఫ్యాప్టో ధర్నాను జయప్రదం చేయండి

1 min read

– FAPTO జిల్లా చైర్మన్ యస్. గోకారి

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉపాధ్యాయ,విద్యా రంగ అపరిస్కృ త సమస్యల సాధన కోసం రాష్ట్ర ఫ్యాప్టో పిలుపుమేరకు కర్నూలు జిల్లా  కలెక్టరెట్ కార్యాలయము ముందు  ఈనెల 12వ తేదీ శనివారమున జరుగనున్న 12 గంటల ధర్నా కార్యక్రమమును  ఫ్యాప్టో సభ్య సంఘాల రాష్ట్ర/ జిల్లా/ మండల/ పురపాలక/ నగరపాలక అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు, నాయకులు ,కార్యకర్తలు ఉపాధ్యాయుని ,ఉపాధ్యాయులు,ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని  FAPTO జిల్లా చైర్మన్  ఎస్. గోకారి సెక్రెటరీ జనరల్ జి. తిమ్మప్ప లు పిలుపునిచ్చారు. తేదీ 10 .8. 2023 స్థానిక సలాం ఖాన్ ఎస్టియు భవన్లో  FAPTO  ముఖ్య నాయకుల సమావేశం తిమ్మప్ప అధ్యక్షతన  జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  1.పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 2.జీవో నెంబర్ 117 ను వెంటనే రద్దు చేయాలని  3.బదిలీలు పదోన్నతులు పొందినటువంటి ఉపాధ్యాయులకు మరియు ప్రధానోపాధ్యాయులకు వెంటనే జీతాలు చెల్లించాలని 4.ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి మార్చుకోవాలని,5.బోధనకు ఆటంకంగా ఉన్నటువంటి యాప్లను వెంటనే రద్దు చేయాలని  6.ఫేషియల్ అటెండెన్స్ లో ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించాలని  7.పిఆర్సి, డిఏ.బకాయిలను ఏక మొత్తంగా చెల్లించాలని 8.పిఎఫ్, ఏపీ జి ఎల్ ఐ సరెండర్ లీవ్ బిల్లుల చెల్లింపులు సమస్యను వెంటనే పరిష్కరించాలని  9.ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్  అన్ని ఆసుపత్రులలో అమలు అయ్యేవిద ముగా చర్యలు తీసుకోవాలని  10.ఆగిపోయినటువంటి స్కూల్ అసిస్టెంట్   ఇంగ్లీష్,తెలుగు, హిందీ ఉర్దూ పదోన్నతులను పూర్తి చేయాలని 11. ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించి జూనియర్ లెక్చరర్ గా పదోన్నతులు కల్పించాలని12. జీవో నెంబర్ 145 సవరించి రాబోయే పదోన్నతులలో సీనియర్ ఉపాధ్యాయులకు  న్యాయం చేయాలని 13. కేజీబీవీ ఉపాధ్యాయులకు ఎంటిఎస్ ను అమలు చేయాలని14. మున్సిపల్ మరియు ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు నుండి శ్రీధర్,గోవింద్ నాయక్ UTF నుండి యస్ జయరాజ్,APTF 1938 నుండి మరియానందం, గాఫ్ఫార్ , హబీబుల్ HMA నుండీ Y నారాయణ,BTA నుండీ సుధాకర్,APPTA నుండి సేవా నాయక్, రాజా  సాగర్ తదితరులు పాల్గొన్నారు.

About Author