టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్ కై కేంద్ర విద్యా శాఖా మంత్రికి వినతి
1 min readపల్లెవెలుగు వెబ్ న్యూ ఢిల్లీ : పార్లమెంటు భవన్ నందు కేంద్ర విద్యా శాఖా మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సి హెచ్ శ్రావణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యస్. బాలాజీ,ABRSM జాతీయ సహ కార్యదర్శి యం రాజశేఖర్ రావు,ABRSM ( హైయ్యర్ వింగ్) ఏ పి రాష్ట్ర అధ్యక్షులు వై వి రామి రెడ్డి,ప్రధాన కార్యదర్శి రంగ నాథ్,మీడియా ప్రతినిధి మహేంద్ర నాథ్ లు పార్లమెంట్ భవన్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ జేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ గురించి వినతి పత్రం అందజేశారు. సవివరంగా చర్చించి అమలుకు సహకరించాలని కోరడం జరిగింది. ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న కారణంగా విద్యా శాఖలో ప్రమోషన్ల విషయం లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఏకీకృత సర్వీస్ రూల్స్ పై 2017లో రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేయడం జరిగిందని, న్యాయపరమైన వివాదాల కారణంగా అమలుకు నోచుకోలేదని, ప్రత్యేక చొరవ తీసుకొని ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలుకు సహకరించాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారిని కోరగా సానుకూలంగా స్పందించారు.