పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
1 min read– ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి
పల్లెవెలుగు వెబ్ డోన్: డోన్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకునేలా అభివృద్ధి చేసి చూపుతున్నామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేం ద్రనాథరెడ్డి అన్నారు. శుక్రవారం ప్యాపిలి మండలంలోని ఎన్ హెచ్ 44 నుంచి వెంగళంపల్లి మీదుగా రూ 1 కోట్లతో నిర్మించిన బీటీ రహదారిని ఆయన ప్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి వెంగళంపల్లి వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం పాఠశాలలో నా మట్టి- నా దేశం కార్యక్ర మంలో పాల్గొన్నారు. పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయా లన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మాంసం కార్పొరేషన్ అధ్యక్షుడు శ్రీరాములు, జెడ్పీటీసీ బోరెడ్డి శ్రీరామిరెడ్డి, వ్యవసాయ మండల సలహా చైర్మన్ మొట్టు వెంకటేశ్వర రెడ్డి, మార్కెట్ యార్డు ఛైర్మన్ నారాయణ మూర్తి, సింగిల్ విండో అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, వైసిపి నాయకులు గడ్డం భువనేశ్వర్ రెడ్డి,బోర మల్లికార్జున రెడ్డి, సీమా సుధాకర్ రెడ్డి,కమతం భాస్కర్ రెడ్డి,చిన్నపూజార్ల రామచంద్ర రెడ్డి, వెంగళంపల్లి సర్పంచ్ కొండాపురం రంగస్వామి, ఎంపిటిసి రామానాయుడు,మద్దయ్య మరియు వైసిపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.