రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిసారించాలి
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : రైతులు ప్రత్యామ్నాయ పంటలైన మినుము పెసర , జొన్న పంటలపై దృష్టి సారించాలని మండల అగ్రికల్చర్ అధికారి శ్రీదేవి అన్నారు, చెన్నూరు రైతు భరోసా కేంద్రంలో అగ్రికల్చర్ అడ్వైజ్ వెరీ బోర్డ్ అధ్యక్షులు ఎర్రసాని మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం మండల స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగినది, ఈ సందర్భంగా , మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎరసాని మోహన్ రెడ్డి లు మాట్లాడుతూ కేసీ కెనాల్ కు సాగునీరు అందించే విషయమై కేసీ కెనాల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు ,అలాగే ప్రత్యామ్నాయ పంటలు అయిన మినుము, పెసర, జొన్న విత్తనాలు రైతు భరోసా కేంద్రాలలో రైతులకు అందుబాటులో ఉంచాలని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఖరీఫ్ 2023 పంట నమోదు ప్రక్రియ ప్రారంభం అయినదని రైతులు పంట నమోదు చేసుకోవాలని తెలియజేశారు, అదేవిధంగా ఖరీఫ్ 2022 పంట రుణాలు సకాలంలో చెల్లించిన రైతులకు సున్నావడ్డి వర్తిస్తుందని రైతులు బ్యాంకులో ఈ పంట వివరాలు అప్లోడ్ అయినది లేనిది తెలుసుకొనవలెనని తెలియజేశారు, వర్షాభావ పరిస్థితులు ఉన్నందువలన ప్రత్యామ్నాయ పంటలైన మినుము పెసలుకు ఇండెంట్ పెట్టడం జరిగినదని ఆమె తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ , జిఎన్ భాస్కర్ రెడ్డి , సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ పలువురు వ్యవసాయ సలహా మండలి సభ్యులు, రైతులు పాల్గొనడం జరిగినది.