బిజెపి చేతిలో టిడిపి వైసిపిలు కీలు బొమ్మలు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: రాష్ట్రానికి బిజెపి పార్టీ ఒక శని గ్రహం అని వైకాపా, టీడీపీలు రాహుకేతువులుగా దాపురించాయని కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావలసిన అవశ్యకత ఎంతైనా ఉందని మాజీ రాజ్యసభ సభ్యులు రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ న రెడ్డి తులసి రెడ్డి అన్నారు, శుక్రవారం చెన్నూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కమలాపురం నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశానికి తీరని ద్రోహం చేసిందన్నారు, రాష్ట్రానికి సంజీ వి లాంటి ప్రత్యేక హోదా కు వందనాలు పెట్టిందని తెలియజేశారు, జిల్లాలోని స్టీల్ ప్లాంట్ కు స్వస్తి పలకడంతో పాటు, దుగ్గరాజా పట్నం ఓడరేవు ఊసే ఎత్తలేదు అన్నారు, రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ కంట్ తరహా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చిందని తెలిపారు, అదేవిధంగా ప్రాజెక్టు ప్రశ్నార్థకమైందని తెలిపారు, అంతేకాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రస్తావన లేనేలేదని ఆంధ్ర ఆత్మ భిమానానికి ప్రతీక అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంటును అమ్మకానికి పెడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ వరకు 13 మంది ప్రధానుల కాలంలో కేంద్ర ప్రభుత్వం 46లక్షల కోట్ల రూపాయ లు అప్పులు చేయగా 8 సంవత్సరాల మోడీ పాలన లో 109 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేయడం జరిగిందన్నారు , కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశాన్ని అమ్మకానికి పెట్టడంతో పాటు, ప్రభుత్వ రంగ సంస్థలను విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను, రైల్వే స్టేషనులను అమ్మేస్తుందని ఆయన దూయపడ్డారు, దేశంలో నిరుద్యోగులు పెరిగిపోవడంతో పాటు, డీజిల్ వంట గ్యాస్, నిత్యవసర ధరలు సామాన్యునికి అందుబాటులో లేవన్నారు, సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో టిడిపి వైకాపా జనసేనలకు ఓటేస్తే అది బిజెపి కి చెందుతుందని ఆయన తెలిపారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే ఆరు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, 500రూపాయలకు“వంట గ్యాస్ సిలిండర్ సరఫరా నిరుపేద కుటుంబాలకు నెలకు 6000 రూపాయలు ఆర్థిక సహాయం, రాష్ట్రానికి సంజీవిని ప్రత్యేక హోదా అమలు లాంటి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు, అనంతరం కమలాపురం సమన్వయ కమిటీ కన్వీనర్ విష్ణు ప్రియతమ రెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా సంస్థాగతంగా బలోపేతం చేయడం జరిగిందన్నారు జరిగిందన్నారు, సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు పొట్టి పాటి చంద్రశేఖర్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, వెంకటరెడ్డి, షేక్ గౌసియా, నాగరాజ రెడ్డి, చార్లెస్, నందన్ భాష, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.