(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిరసన మహాధర్నా కార్యక్రమం..
1 min readపల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరులో కలెక్టరేట్ ప్రాంగణంలో శనివారం మహా ధర్నా నిరసన కార్యక్రమం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దుచేసి ఓల్డ్ పెన్షన్ స్కీమును పునర్ధరించాలని, జీవో నెంబర్ 117 ను రద్దు చేయాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ధర్నావద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో 12 గంటల సామూహిక నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు.దానిలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ధర్నా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆందోళన కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, వామపక్ష పార్టీ కార్మిక సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిరసనలతో హోరెత్తించారు. మహిళ ఉపాధ్యాయులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనటం తో ఉపాధ్యాయుల సంఘాల నాయకులలో ఉత్సాహం మరింత రెట్టింపైయింది. ప్రతి విజయం వెనుక స్త్రీ తోడ్పాటు ఉంటుందనడనికి ఇదే నిదర్శనం మన్నారు.