విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సన్నద్ధం కండి
1 min read– ఏ ఐ ఎస్ ఎఫ్ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్. క్రిష్ణయ్య విద్యార్థులకు పిలుపు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: విద్యారంగ సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏ ఎస్ ఎఫ్ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్ కృష్ణయ్య విద్యార్థులకు పిలుపునిచ్చారు. సోమవారం పత్తికొండలో ఏఐఎస్ఎఫ్ 88వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అల్తాఫ్ అధ్యక్షత వహించారు. ఏ ఐ ఎస్ ఎఫ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర సమితి సభ్యులు ఎన్. కృష్ణయ్య పాల్గొని ఏ ఐ ఎస్ ఎఫ్ పతాక ఆవిష్కరణ గావించారు.ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12వ తేదీన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని లక్నో నగరంలో జోహార్ లాల్ నెహ్రూ మహమ్మద్ ఆలీ జిన్నా చేతులమీదుగా పురుడు పోసుకుని, ఆనాటి నుండి ఈనాటి వరకు మల్లెతీగ వలె అల్లుకొని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినటువంటి ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. స్వాతంత్ర సంగ్రామ పోరాటంలో విద్యార్థులు వీరోచిత పోరాటాలు తో రాజ్ గురు, సుఖదేవ్, భగత్ సింగ్ ఆశయసాధన లతో శాంతి అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం అజెండా పెట్టుకొొని, ప్రథమ మహాసభల్లో ప్రేమ్ భార్గవ్ నారాయణ్ ఆలిండియా జనరల్ సెక్రెటరీగా ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. స్వాతంత్రం అనంతరం విద్యారంగ సమస్యలపై చదువు పోరాడు అను నినాదంతో పాలకులు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలుు, విద్య కాషాయీకరణ కు ప్రైవేటీకరణకు వ్యతిరేకముగా పోరాటాలు సాగిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అని అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్య సమానంగా అందించాలని పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని, అదేవిధంగా పత్తికొండలో గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేసి సాధించుకున్న ఘనత ఏఐఎస్ఎఫ్ కు మాత్రమే ఉందని వారు తెలిపారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్యను కషాయకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిని విద్యార్థులు గుర్తించి చదువుతోపాటు ఉద్యమాలలో కూడా విద్యార్థులు ముందుండాలని కోరారు. ప్రభుత్వాలు విద్య హక్కు చట్టాలను తుంగలో తొక్కుతూ వాటి ఆచూకీ లేకుండా చేస్తున్నారని విద్యా హక్కు చట్టాలను విద్యార్థులు కాపాడుకోవలసిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ మండల సహాయ కార్యదర్శి శివ నాయకులు, , రమేష్, మహేష్, సమీర్, షాహిర్, కార్తీక్, వలి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.