మీ పదవుల కోసం ప్రలోభాల కోసం జాతిని తాకట్టు పెట్టొద్దు
1 min readపెద్దిరెడ్డిది… యాదవులపై ప్రేమ కాదు ధృతరాష్ట్ర కౌగిలి…….
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు ఆగ్రహం…. పుంగనూరు వచ్చే యదు వీరులు ఒక్కసారి ఆలోచించుకోవాలి.మీ పదవుల కోసం ప్రలోభాల కోసం జాతిని తాకట్టు పెట్టొద్దు. పోరాడే వారికి చేయందించు. అంతేకానీ జాతికి ద్రోహం చేయొద్దు. పుంగనూరులో బీసీ రామచంద్ర యాదవ్ గారిని ఢీకొనలేక పెద్దిరెడ్డికి ఈరోజు యాదవులు బీసీలు గుర్తుకొచ్చారు. ఎంతమంది యాదవులను నీ మంచం మీద కూర్చోబెట్టుకుంటున్నావ్ పెద్దిరెడ్డి. నీతో సమానంగా కూర్చుంటే జీర్ణించుకోలేని నువ్వు యాదవులకు ఎలాంటి మేలు చేస్తాఓ ఒక్కసారి తెలియపరచాలి. యాదవులపై భౌతిక దాడులు చేసి భయభ్రాంతుల కు గురిచేసి పుంగనూరులో విద్యా ఉద్యోగాలకు ప్రాధాన్య మిచ్చిన రామచంద్ర యాదవ్ పెట్టిన జాబ్ మేళా పై దాడులు చేయించి వేలాదిమంది బీసీ సోదరుల జీవనోపాధిపై దెబ్బ కొట్టిన నీకు యాదవులు బీసీలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా. రాజకీయంగా ఎదుర్కోలేక బీసీ సోదరుడు రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేసి రాక్షసానందం పొందింది నువ్వు కాదా. ఇదే కాక గత నెల 29వ తేదీన పెద్దిరెడ్డి మండలంలోకి రామచంద్ర యాదవ్ ను రాకుండా అడ్డగించుకొని రెండువేల మంది రౌడీలు గుండాలకు రాళ్లు కట్టెలు గొడ్డళ్లు కొడవళ్ళు ఇచ్చి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని దారులకు బారికేట్లు అడ్డుపెట్టి నీ సొంత మండలంలోకి రాకుండా అడ్డుకొని రాక్షసానందం పొందిన నువ్వు యాదవులకు న్యాయం చేస్తానని ఆత్మీయ సమావేశం పెట్టడం నక్కకు నామాలు పెట్టినట్టు ఉంది.యాదవులను మోసగించడానికి నువ్వు మీటింగ్ పెడితే నీ మీటింగ్ కు రావటానికి యాదవ్ బిడ్డలకు యాదవ్ సోదరులకు యాదవ్ సింహాలకు సిగ్గు లేదనుకున్నావా పెద్దిరెడ్డి.. అంటూ జిల్లా అధ్యక్షులు వై. నాగ శేషు మండిపడ్డారు.
యాదవులు, 29వ తేది, ఆత్మీయ సమావేశం,