PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దేవుడు సాక్షిగా..గంట కొట్టి ప్రమాణం చేయించి..

1 min read

– రైతులకు ధాన్యం సొమ్ము చెల్లింపు.

– రైతులకు రూ.2 కోట్లకు  కుచ్చుటోపీ పెట్టిన వ్యాపారి.

– వ్యాపారి నుంచి రూ.20.60 లక్షలు వసూళ్ళు.

– గ్రామ ప్రజల సమక్షంలో రైతులకు పంపిణీ.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పూర్వం మన పెద్దలు అప్పు  తీర్చలేని వారిని ఉదేశించి ఒక సామెత చెప్పేవారు. పూలు పెట్టే కాడా పత్తేరనైనా పెట్టమని అంటుండేవారు. అలాంటి సంఘటననే నందికొట్కూరు మండలం కొణిదెల గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన ధాన్యం  వ్యాపారి రూ.2 కోట్ల దాకా రైతులకు చెల్లించకుండా చేతులెత్తివేస్తే రైతులు పోలీసులను ఆశ్రయించారు. మూడేళ్ళు గా వ్యాపారి చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగితిరిగి అలసిపోయి చివరకు వ్యాపారి చెల్లించిన అరకొర సొమ్మును తీసుకొని తృప్తి పడ్డారు. ఈ చెల్లింపు కూడా విచిత్రంగా జరిగింది. డబ్బులు తీసుకున్న రైతులు   ఆంజనేయ స్వామి కి పత్తేర సమర్పించి  గుడిలోని గంట కొట్టాలి. రైతులందరు ఒకే అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి విభేదాలు చోటు చేసుకోకుండా రైతులకు చెల్లింపు జరిపారు. గ్రామస్తులు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.   రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొణిదెల గ్రామానికి చెందిన  ధాన్యం వ్యాపారి శివ పుల్లయ్య , సుబ్బయ్య  కొనుగోలు చేసి దాదాపు  రూ.2.60 కోట్లకు పైగా నగదు ఇవ్వకుండా టోకరా వేశాడని బాధిత రైతులు 185 మంది  నందికొట్కూరు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో 2019 ఫిబ్రవరిలో  ఫిర్యాదు చేశారు. అదే వ్యాపారికి కొంతమంది నాయకుల వలన ప్రాణహాని ఉందని తెలిసి రైతులు అండగా నిలిచారు.కొణిదెల కు చెందిన సాయిబాబా కుమారులు  శివ పుల్లయ్య ,సుబ్బయ్య లు  గ్రామానికి చెందిన 185 మంది రైతులు వద్ద మార్చిలో మొక్కజొన్న, కందులు, పెసలు, శనగలు ,వరి ధాన్యాన్ని  తీసుకున్నాడు. 15 రోజుల్లో డబ్బులు ఇస్తానన్నాడు. రోజులు, నెలలు గడచినా ఇవ్వలేదు. అదేమంటే  కొద్ది రోజుల్లో ఇస్తానని ,పెళ్లి ఉందని చెబుతూ వచ్చాడు. దీనితో రైతులు పోలీసులను ఆశ్రయించారు. పోలిసులు కేసు నమోదు చేసి వ్యాపారి శివ పుల్లయ్యను రిమాండ్ కు పంపడం జరిగింది.ఆ తర్వాత అతను గ్రామం వదలి గూడూరుకు మకాం మార్చాడు.నాటి నుండి  నేటివరకు రైతులకు ఒక పైసా కూడా చెల్లించలేదు .ఇది జరిగి మూడు ఏళ్ళు గడిచింది. ఇది ఇలా ఉండగా వ్యాపారి శివ పుల్లయ్యకు చెందిన ఇంటిని గ్రామానికి చెందిన  చల్లా శివకుమార్ రెడ్డి తన పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న విషయం తెలిసి రైతులు నిలదీశారు.ఇంటిని  రూ. 20 లక్షలకు అమ్మినట్లు తెలిసి  కోర్టులో  కేసు విచారణలో  వుండగా ఎలా కొంటావని  రైతులు నిలదీశారు. శివ పుల్లయ్య  ఇంటిని అమ్మకానికి పెట్టాగా  కొనుగోలు చేసినట్లు తెలుసుకున్న  రైతులు మళ్ళీ పోలీసులను ఆశ్రయించారు. వ్యాపారిని పట్టుకొస్తే రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు హామీ ఇవ్వడం తో  పరారీలో ఉన్న వ్యాపారిని వెదికిపట్టుకొని పోలీసులకు అప్పగించారు.బలవంతంగా రాయించుకున్న ఇంటిని విడిపించారు. .నందికొట్కూరు అర్బన్ సిఐ విజయ భాస్కర్ , ఎస్సై ఎన్వీ రమణ లు రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.పోలీసులు  శివ పుల్లయ్యను రైతుల సమక్షంలో విచారణ జరిపి ఇరువురిని రాజీ కుదిర్చారు. శివ పుల్లయ్య ఇంటిని అమ్మగా వచ్చిన మొత్తాన్ని రైతులు పంచుకోవాలని రాజీ కుదిర్చారు.అందుకు రైతులు సమ్మతించారు.గ్రామస్తులు రంగస్వామి, మౌలాలి లు రూ.20.60 లక్షల కు శివ పుల్లయ్య ఇంటిని కొనుగోలు చేశారు.ఈ డబ్బును శనివారం గ్రామ సర్పంచి కొంగర నవీన్, పట్టణ ఎస్సై ఎన్వీ రమణ, ఆలయ ధర్మకర్త కిరణ్ , ఎంపీటీసీ సురేష్ , గ్రామ రైతులు చేపల మహేశ్వరయ్య, రంగస్వామి, పర్వతాలు, చిన్న కొండారెడ్డి, అయ్యన్న, గొల్ల శేషన్న , దావీదు, విమలమ్మ ల సమక్షంలో  రూ.20.60 లక్షలు దాదాపు 140 మంది రైతులకు చెల్లించారు.నూటికి ఆరు ..  లక్షకు  రూ.6 వేలు పర్శింటేజ్  ప్రకారం  రైతులందరు తీసుకోవాలని చేసుకున్న  ఒప్పందం  ప్రకారం చెల్లించారు.ఈ తతంగాన్ని చూసిన ప్రజలు పూలు పెట్టె కాడా పత్తేర పెట్టడం అంటే ఇదేనేమో అని పెద్దల సామెతను గుర్తుకుతెచ్చుకుని నవ్వుకున్నారు.

About Author