డ్రైనేజీ కాలువల నిర్మాణం పూర్తి చేయాలి…
1 min read– ఆర్డీవో కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని ప్రధాన రోడ్లకు ఇరువైపులా డ్రైనేజీ కాలువల నిర్మాణం తక్షణమే పూర్తి చేయాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, డిమాండ్ చేశారు. సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ కూడలి నుండి రోడ్డు సైడ్ వ్యాపారస్తులతో కలిసి ఆర్డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రోడ్ల వెడల్పు పేరుతో ఆర్ అండ్ బి, గ్రామపంచాయతీ అధికారులు ఊరు వాకిలి దగ్గర నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ప్రధాన రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాలువలను తవ్వి వదిలి పెట్టారు.దీంతో రోడ్డు సైడ్ వ్యాపారస్తులు గత నాలుగు నెలల నుండి ఉరువాకిలి కింద ఉన్న రోడ్డు వెడల్పు కటింగ్ పేరుతో ఇరువైపులా డ్రైరేజ్ కాలువ తొలగించి అలాగే వదిలేయడం ద్వారా షాపుల్లోకి వెళ్లడానికి, రావడానికి తీవ్ర అటంకం కలుగుతూ, తీసిన గుంతలలో చాలామంది కిందపడి గాయాలైన సంఘటనలు ఉన్నాయని అన్నారు. ఈ కారణంగా వ్యాపారాలు జరక్క బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వ్యాపారాలు చేయడానికి ప్రజలు ఎవరూ కూడా రాకపోవడంతో తెచ్చుకున్న వస్తువులు తెచ్చుకున్న మాల్ అమ్ముడు పోక, తెచ్చుకున్న అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చిన వారు ఒత్తిడి చేస్తూ, మరోపక్కబాధిత కుటుంబాలు రోడ్డుపాలు అవుతూ, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. డ్రైనేజీ కాలువలు తవ్వి నాలుగు నెలలు పూర్తయిందని, ఇప్పటివరకు అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే అధికారులు స్పందించి డ్రైనేజీ కాలువల నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డిఓ మోహన్ దాస్ కు వినతి పత్రం సమర్పించారు. సిపిఐ పట్టణ కార్యదర్శి రామాంజనేయులు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణయ్య ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కారుమంచి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు గురుదాస్, కారన్న, ఏఐటియుసి తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు నెట్టికంటయ్య, రంగన్న, నాయకులు మాదన్న, జోహారాపురం కాశి, నాగేంద్ర, పెద్దయ్య, శ్రీనివాసులు రమేష్ బసవరాజు సుభాన్ శివయ్య ఈరన్న శెట్టి కూరగాయల శీను హోటల్ రాజు తదితరులు పాల్గొన్నారు.