బావి భారత పౌరులు- నా భూమి నా దేశం కొరకు పాటుపడాలి
1 min read– రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, కార్యదర్శి శాంతమ్మ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: భావిభారత పౌరులు మన మాతృభూమి కోసం, నా భూమి నా దేశం అంటూ పాటుపడాలని రాష్ట్ర టు విశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి, కార్యదర్శి శాంతమ్మ లు తెలిపారు, సోమవారం మండలంలోని రామనపల్లి పంచాయతీలలో నా భూమి- నా దేశం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్, కార్యదర్శులు మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి 15వ తేదీ వరకు మనభూమి- మన దేశం కార్యక్రమంలో భాగంగా, దేశ లో స్వాతంత్రం కొరకు పాటుపడిన మహనీయులందరినీ కూడా స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు, అంతేకాకుండా వారికి వందనాలు తెలియజేస్తూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన సూచించారు, జీవితంలో ప్రతి రోజు, ప్రతిక్షణం, ప్రతి అణువు మాతృభూమి కోసం జీవించడమే ధ్యేయంగా పెట్టుకోవాలని తెలిపారు, అలాగే వీరులందరికీ వందనం, నేల తల్లికి నమస్కారం, అంటూ చేసే నినాదాలే స్వతంత్ర సమరయోధుల కోసం మనం అర్పించే నిజమైన నివాళులు అని ఆయన అన్నారు, అదేవిధంగా పర్యావరణ కొరకు పాటుపడాలని, స్వచ్ఛమైన గాలి, నీరు, సారవంతమైన నేలను భావితరాలకు అందించాలంటే, మనమందరం పుడమతల్లిని కాపాడుకోవాలని ఆయన తెలియజేశారు, అనంతరం అటవీ శాఖ డైరెక్టర్ రమణ శ్రీలక్ష్మి మొక్కలు నాటడం జరిగింది, ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, ఉపాధి హామీ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు ,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.