ఎన్నికల్లో ఉత్కంఠత,బుజ్జగింపులు..రాజీ ..
1 min read-మూడు గ్రామాల్లో వార్డుకు ఏకగ్రీవం -అలగనూరు,పైపాలెంలో ఎన్నికలు
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండలంలోని ఐదు గ్రామాలలో గ్రామ పంచాయతీ వార్డులకు ఐదు గ్రామాలలో ఎన్నికల నిర్వహించాలని ఎన్నికల అధికారులుఇతరులు జారీ చేశారు.అందుకుగాను మిడుతూరు మండల కేంద్రమైన మిడుతూరులో 13 వ వార్డుకు వైసీపీ మండల కన్వీనర్ మరియు గ్రామ ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర రెడ్డి అభ్యర్థి మూల మాధవి వార్డు మెంబర్ గా గతంలో నామినేషన్ వేయించారు.అదే రోజున మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా చిన్న మల్లారెడ్డి అభ్యర్థిగా బోయ భాగ్యమ్మను నామినేషన్ వేయించారు.తర్వాత అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.ఒకే పార్టీలో ఒకే వార్డుకు ఇద్దరు ఎన్నికల బరిలో నిలబడితే పార్టీకి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆదేశాల మేరకు జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,మండల వైసీపీ నాయకులు మల్లు శివ నాగిరెడ్డి,సొసైటీ చైర్మన్ తులసిరెడ్డి,పేరెడ్డి వెంకటరామిరెడ్డి,భూపాల్ రెడ్డి తదితర నాయకులు వార్డు అభ్యర్థి ఉపసంహరణ కోసం వారు రంగంలోకి దిగారు.ఈనెల 11వ తేదీన మిడుతూరు తువ్వా లోకేశ్వర రెడ్డి స్వగృహంలో వార్డు అభ్యర్థిని ఉప సంహరించుకోవాలని దాదాపుగా రెండు గంటల పాటు లోకేశ్వర రెడ్డిని నాయకులు బుజ్జ గింపులు చేశారు.అయినా సరే ఆయన తగ్గలేదు మా అభ్యర్థిని తప్పనిసరిగా పోటీలో నిలుపుతానని ఆయన స్పష్టం చేశారు.కానీ నాయకులు ఒకే పార్టీలో ఇద్దరూ పోటీ వద్దని దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతూ ఉందని చివరకూ లోకేశ్వర రెడ్డిని ఒప్పించారు నాయకులు.నాయకులకు ఇచ్చిన హామీ మేరకు నిన్న సోమవారం ఉదయం 11 గంటలకు మిడుతూరు పంచాయతీ కార్యాలయంలో లోకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫక్రుద్దీన్ కు వార్డు అభ్యర్థి నుండి మూల మాధవి ఉపసంహరించుకున్నారు.ఇక్కడ 13వ వార్డు మెంబర్ గా బోయ భాగ్యమ్మ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ఫక్రుద్దీన్ తెలిపారు. అదేవిధంగా వీపనగండ్లలో 3వ వార్డు మెంబర్ గా కె.చిన్న స్వామన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.జలకనూరులో ఎనిమిదవ వార్డుకు టిడిపి తరఫున ఎస్.కుమారి ఒక్కరే నామినేషన్ వేయడం వలన ఇక్కడ ఏకగ్రీవంగా ఈమె ఎన్నిక అయ్యారు.తర్వాత అలగనూరులో 10వ వార్డుకు అధికార పార్టీ నుండి తాటిపాటి సుధాకర్,టిడిపి పార్టీ నుండి పోలగల్లు శేషమ్మ వీరు పోటీలో ఉన్నారు ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయ్.పైపాలెంలో మాత్రం 5వ వార్డుగా గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు బోయ బాల సుబ్బన్నతో నామినేషన్ వేయించారు. బిజెపి నుండి నాగేశ్వరరావు,ఎమ్మెల్యే వర్గం నుండి ఇ నాయతుల్ల,టిడిపి అభ్యర్థి పి క్కిలి లక్ష్మీదేవికి సపోర్ట్ చేస్తూ గ్రామ టిడిపి నాయకులు మాజీ డీలర్ మానపాటి.వెంకటేశ్వర్లు వెంకటయ్య ఆధ్వర్యంలోగతంలో నామినేషన్ వేశారు.కానీ ప్రస్తుతం వార్డు ఎన్నికలకు మేము దూరంగా ఉంటున్నామని నాగేశ్వరరావు,ఇనాయతుల్ల చెబుతూ ఉండడం విశేషం.ఇక్కడ వార్డుకు ఎన్నికలు జరగనున్నాయ్.మిడుతూరు, వీపనగండ్ల,జలకనూరు గ్రామాలు వార్డులకు ఏకగ్రీవం అయ్యాయి.మిగతా గ్రామాలు అయిన అలగనూరు,పైపాలెం గ్రామాల్లో వార్డులకు ఈనెల 19వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తెలిపారు.