యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి: పి. నరసింహరావు
1 min readయూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పి. నరసింహరావు
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
పల్లెవెలుగు: దేశ ప్రజలు, యువత దేశ భక్తిని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ పి. నరసింహరావు. 77వ స్వాతంత్ర్యదినోత్సవం పురస్కరించుకుని మంగళవారం రీజనల్ కార్యాలయంపై మువ్వెన్నల జెండాను రెపరెపలాడించారు. ఈ సందర్భంగా బ్యాంకు రీజనల్ హెడ్ పి.నరసింహరావు మాట్లాడుతూ విద్యార్థులు అజాదికా అమృత్ మహోత్సవం గురించి పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలర్పించారని, వారి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్ర్య సమర యోధుల జీవిత చరిత్ర… నేటి యువతకు స్పూర్తిదాయకమన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజనల్ హెడ్ ఇ.సురేంద్ర గౌడ్, సెక్యురిటీ ఆఫీసర్, ఎక్స్ సర్వీస్ మెన్ శ్యామ్ కిశోర్ ప్రసాద్, బ్యాంకు మాజీ మార్కెటింగ్ మేనేజర్ ప్రసాద్ బ్యాంకు క్యాషియర్ సురేష్ రెడ్డి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.