PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్తమ సేవాకు  ప్రశంసా పత్రం

1 min read

– అన్నమయ్య జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ బి.హరిక్రిష్ణ.

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో:  అన్నమయ్య జిల్లా లో పోలీస్ పరేడ్ మైదానం నందు వ్యవసాయ శాఖా   మంత్రి వర్యులు ,జిల్లా ఇంచార్జి మంత్రి   కాకాని గోవర్ధన్ రెడ్డి   ,కలెక్టర్  గిరీషా   ,ఎస్పి గంగాధర్ రావు  ఐపిఎస్   చేతుల మీదగా ప్రశంసా పత్రం  బి.హరిక్రిష్ణ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్బంగా 2023 సంవత్సరంలో ఉత్తమ ప్రశంస పత్రం అందుకోవడం జరిగిందన్నారు .ఈ ప్రశంస పత్రం అందుకోవడంతో తమపై మరింత బాధ్యత పెరిగిందని  జిల్లా లో అనేక మందికి స్కిల్ హబ్ల ద్వారా  శిక్షణ ఇచ్చి, జాబ్ మేళా ల ద్వారా వారికి ఉద్యోగభద్రత కల్పించడం నా బాద్యత గా పని చేస్తాను అని తెలియచేస్తూ,ఉత్తమ మైన సేవలు అందజేయడమే తమ లక్ష్యం అని  వారు తెలియజేశారు.

About Author