PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మరోస్వాతంత్ర్య పోరాటానికి సిద్ధం కండి …

1 min read

– పార్టీ శ్రేణులకు బి.టి.నాయుడు పిలువు

పల్లెవెలుగు వెబ్ కల్లూరు అర్బన్ : కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం నందు జిల్లా పార్టీ అధ్యక్షులు బి.టి.నాయుడు  ఆద్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కోడుమూరు ఇన్చార్జీ ఆకెపోగు ప్రభాకర్ మరియు పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 77వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘణంగా నిర్వహించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు కీ. శే., శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి గటించారు. అనంతరం జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో త్రివర్ణపతాకాన్ని జిల్లా అధ్యక్షులు బి.టి.నాయుడు ఎగురవేశారు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకొని శుభాకాంక్షులు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించిపెట్టడంలో ఎంతో మంది దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేశారనీ, అలాంటి మహానీయుల ప్రాణత్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్య్రం. సిద్దించిందనీ, అనాడు బ్రిటీష్ తెల్లదొరలను దేశం నుండి పారద్రోలేందుకు స్వాతంత్య్ర పోరాటం చేసి దేశం నుండి తరిమి తరిమికొట్టారనీ, అనాటి పోరాటాల ఫలితంగా బ్రిటీష్ వారి దాస్యశృంకలాల నుండి భరతమాతకు విముక్తికలిగిందనీ అన్నారు. అనాడు తెల్లదొరలతో పోరాటం చేస్తే, నేడు ఆంద్రరాష్ట్రాన్ని పాలిస్తున్న వై.సి.పి. నల్లదొరలు వారి నాయకుడు నల్లదొర జగన్ రాష్ట్రాన్ని సమూలంగా దోచేస్తున్నారనీ, రాష్ట్రం అన్ని రంగాలలో దోపిడికి గురైందనీ, ఉదా :- మైన్, వైన్, ఇసుక, ఇలా ఏరంగాన్ని కూడా వదలకుండా దోచేశారనీ, ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఆంద్రప్రదేశ్ గా మార్చివేసి 10 లక్షల కోట్ల అప్పును ప్రజలపై పడేలా చేశారనీ, జగన్ రెడ్డి మాత్రం భారతదేశంలో అత్యంత సంపన్నులైన ముఖ్యమంత్రిగా పేరుతెచ్చుకున్నారనీ, వారి దోపిడి నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే తెలుగుదేశంపార్టీ చేస్తున్నటువంటి పోరాటానికి ప్రజలంతా మద్దతుగా నిలిచి, వారి దోపిడి నుండి ఆంద్రరాష్ట్రాన్ని కాపాడేందుకు మన పెద్దలు తెల్లదొరలను దేశం నుండి పారిపోయేలా చేసేందుకు పోరాటం చేశారనీ, ప్రస్తుతం వై.సి.పి. నల్లదొరలైన జగన్ మరియు వారి పార్టీ వారిని పారద్రోలేందుకు మరోపోరాటానికి సిద్దం కావాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జె. తిరుపాల్బాబు, కె.మహేష్ గౌడ్, కె. పరమేష్, బాబురాజ్, యస్. చంద్రశేఖర్, మాసుమయ్య, క్యాతూరు మధు, బి.ఈశ్వరయ్య, యస్. షేక్షావలి, యం. బాలవెంకటేశ్వరరెడ్డి, యల్.వి.ప్రసాద్, ఆర్. బాబురావు, డి.జేమ్స్, సత్రం రామక్రిష్ణుడు, కార్పోరేటర్ రమణమ్మ, రామాంజనేయులు, పి.హనుమంతరావుచదౌరి, ఆర్. సుశీలమ్మ, శివశంకర్ గౌడ్, మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author