డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తికి 4 రోజులు జైలు శిక్ష
1 min readజిల్లా ఎస్పీ శ్రీ K.రఘువీర్ రెడ్డి IPS
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె .రఘువీర్ రెడ్డి IPS ఆదేశాలమేరకు నంద్యాల ట్రాఫిక్ పోలీసులు నంద్యాల పట్టణంలోని ఆత్మకూరు బస్ స్టాండ్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేయుచుండగా ఒక వ్యక్తి మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడగా అతని నివాస స్థలము గురించి విచారించి సదరు మద్యం సేవించిన వ్యక్తిని స్వాధీనంలోనికి తీసుకొని స్పెషల్ రిపోర్ట్ ద్వారా నంద్యాల ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ CI ఇస్మాయిల్ ముందుహాజరు పరచగా సదరు మద్యం సేవించిన వ్యక్తిపై CI గారు సెక్షన్ 185 MV Act మేరకు కేసు నమోదు చేసి కోర్టు నందు చార్జి షీట్ దాఖలు చేసి , నంద్యాల సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ R. రామభూపాల్ రెడ్డి ముందు హాజరుపరచగా సదరు జడ్జి ముద్దాయికి 04 రోజులు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ కె.రఘువీర్ రెడ్డి IPS మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడిపిన, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన, శాంతిభద్రతల విషయంలో ఆటంకం కలిగించిన, మహిళలను కించపరిచే విధంగా వారి గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తించిన అట్టి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టుబడిన వ్యక్తి వివరాలు…
1)కూసు నాగిరెడ్డి, Age : 26 yrs, S/o వెంకట సుబ్బారెడ్డి.. సింగవరం గ్రామం, బండి ఆత్మకూర్ మండలం.
ముద్దాయికి 04 రోజులు జైలు శిక్ష