భూమి సేకరణ పనులు త్వరగా పూర్తి చేయండి…
1 min read– రాష్ట్రంలో జాతీయ రహదారుల నిమిత్తం భూమి సేకరణ పనులు త్వరగా పూర్తి చేయండి…
– రాష్ట్ర రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో జాతీయ రహదారుల నిమిత్తం భూమి సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్ లను రాష్ట్ర రవాణా రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న అదేశించారు.బుధవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి అని జిల్లాల జాయింట్ కలెక్టర్లు మరియు సంబంధిత అధికారులతో రాష్ట్రంలోని జాతీయ రహదారులు నిమిత్తం భూమి సేకరణ పనుల గురించి జిల్లా స్పెషల్ ఆఫీసర్, రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పి.ఎస్.ప్రద్యుమ్న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిమిత్తం భూమి సేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని రాష్ట్రంలోని జాయింట్ కలెక్టర్ లను అదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు నిమిత్తం భూమి సేకరణ పనుల లో ఉన్న సమస్యలు వారికి ఇవ్వవలసిన కంపెన్సేషన్ విషయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారుల ఆర్వో కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న విషయాలు , అవార్డు సమస్యల వివరాల గురించి తెలుసుకున్నారు. అటవీ శాఖ భూములు మరియు మైనారిటీ శాఖ భూముల నిమిత్తం రావలసిన పర్మిషన్లు గురించి తెలుసుకున్నారు. ఎంత మొత్తం జాతీయ రహదారుల వారి నుండి ఇప్పటివరకు ఎంత కంపెన్సేషన్ వచ్చింది ఇంకా ఎంత కంపెన్సేషన్ పెండింగ్ లో ఉంది తదితర విషయాలు వివరంగా అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్ల ద్వారా అడిగి తెలుసుకున్నారు.సోమయాజులపల్లి – డోన్ రహదారి భూసేకరణ పనులు ఏ విధంగా జరుగుతున్నాయని, అలాగే ఆత్మకూరు – సంగమేశ్వరం రోడ్డు విస్తరణ కొరకు భూసేకరణ చేస్తున్న విషయాల గురించి కర్నూలు జిల్లా అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు.నన్నూరు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మరియు హుసేనాపురం దగ్గర అండర్ పాసెజ్ బ్రిడ్జి గురించి చర్చించి త్వరగా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ ని కోరారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, నేషనల్ హైవే అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.